ఏం సుజయ్‌..ఏంటయ్యా ఈ పని | cm chandrababu naidu fired on sujay krishna ranga rao | Sakshi
Sakshi News home page

హత విధీ...

Published Thu, Nov 2 2017 1:31 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

cm chandrababu naidu fired on sujay krishna ranga rao - Sakshi

మంత్రి సుజయకృష్ణ రంగారావు

సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఏం సుజయ్‌..ఏంటయ్యా ఈ పనితీరు.. జిల్లాని, నియోజకవర్గాన్ని గాలికొదిలేశావ్‌.. ఒక్క బహిరంగ సభ కూడా పెట్టలేదు.. ఇలా అయితే ఎలా’’
–రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును ఉద్దేశించి సీఎం చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలివి.

బొబ్బిలి రాజులు. పౌరుషాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు పనితీరులో బేజారైనారు. పదిమందికి చెప్పే పొజిషన్‌ నుంచి ప్రజాప్రతినిధిగా పనికిరారనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. తనకు టిక్కెట్టు ఇచ్చిన పార్టీని వదిలి, ఓట్లేసి గెలిపించిన ప్రజలను వంచించి అధికార పార్టీ పంచన చేరిన ఆ వంశ రాజు చివరికి అక్కడ మాటలు పడాల్సిన దుస్తితిలో ఉన్నారు. తాజాగా రాష్ట్ర మంత్రులందరికంటే ఆయనే అథమ స్థాయిలో నిలిచి అధినేత నుంచి చివాట్లు తిన్నారు. అమరావతి వర్గాల సమాచారం ప్రకారం..

రాష్ట్ర కేబినేట్‌ సమావేశం బుధవారం అమరావతిలో జరిగింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లోని టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఆయా జిల్లాల మంత్రులను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాపై సమీక్ష జరిపిన సీఎం రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగారావుకు క్లాస్‌ తీసుకున్నారు. ఆయన పనితీరుకు ‘సీ’ గ్రేడ్‌ ఇచ్చారు. వందకు కనీసం 25 మార్కులు కూడా తెచ్చుకోలేని వారికి ఈ గ్రేడ్‌ ఇస్తారు. అంటే ఇదే అథమపక్షం అన్నమాట. అలాంటి స్థానంలో రాష్ట్ర మంత్రి, అందునా బొబ్బిలి రాజు సుజయ్‌ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కనీసం 5వేల మందితో నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా మంత్రి అమలు చేయలేక ఫెయిల్‌ అయ్యారు.

దీనిపై కూడా సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క సభ కూడా పెట్టలేకపోవడమేమిటంటూ చిటపటలాడారు. ఇక అరకు ఎంపీ కొత్తపల్లి గీత పనితీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేయగా ఆ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని కురుపాం నియోజకవర్గానికి ‘సి’ గ్రేడ్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement