sujaykrishna rangarao
-
ఏం సుజయ్..ఏంటయ్యా ఈ పని
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఏం సుజయ్..ఏంటయ్యా ఈ పనితీరు.. జిల్లాని, నియోజకవర్గాన్ని గాలికొదిలేశావ్.. ఒక్క బహిరంగ సభ కూడా పెట్టలేదు.. ఇలా అయితే ఎలా’’ –రాష్ట్ర మంత్రి సుజయ్కృష్ణ రంగారావును ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. బొబ్బిలి రాజులు. పౌరుషాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు పనితీరులో బేజారైనారు. పదిమందికి చెప్పే పొజిషన్ నుంచి ప్రజాప్రతినిధిగా పనికిరారనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. తనకు టిక్కెట్టు ఇచ్చిన పార్టీని వదిలి, ఓట్లేసి గెలిపించిన ప్రజలను వంచించి అధికార పార్టీ పంచన చేరిన ఆ వంశ రాజు చివరికి అక్కడ మాటలు పడాల్సిన దుస్తితిలో ఉన్నారు. తాజాగా రాష్ట్ర మంత్రులందరికంటే ఆయనే అథమ స్థాయిలో నిలిచి అధినేత నుంచి చివాట్లు తిన్నారు. అమరావతి వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర కేబినేట్ సమావేశం బుధవారం అమరావతిలో జరిగింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లోని టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఆయా జిల్లాల మంత్రులను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాపై సమీక్ష జరిపిన సీఎం రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగారావుకు క్లాస్ తీసుకున్నారు. ఆయన పనితీరుకు ‘సీ’ గ్రేడ్ ఇచ్చారు. వందకు కనీసం 25 మార్కులు కూడా తెచ్చుకోలేని వారికి ఈ గ్రేడ్ ఇస్తారు. అంటే ఇదే అథమపక్షం అన్నమాట. అలాంటి స్థానంలో రాష్ట్ర మంత్రి, అందునా బొబ్బిలి రాజు సుజయ్ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కనీసం 5వేల మందితో నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా మంత్రి అమలు చేయలేక ఫెయిల్ అయ్యారు. దీనిపై కూడా సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క సభ కూడా పెట్టలేకపోవడమేమిటంటూ చిటపటలాడారు. ఇక అరకు ఎంపీ కొత్తపల్లి గీత పనితీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేయగా ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కురుపాం నియోజకవర్గానికి ‘సి’ గ్రేడ్ ఇచ్చారు. -
బొత్సపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్!
-
బొత్సపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్!
సాక్షి, విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై మంత్రి సుజయ్కృష్ణ రంగారావు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి సుజయ్కృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల డబ్బులు తీసుకొని.. చైన్నైకి పారిపోయిన చరిత్ర ఆయనదని పార్టీ నేత బెల్లాన చంద్రశేఖర్ మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు డిమాండ్ చేశారు. మంత్రి పదవి కోసం పార్టీ మారిన వ్యక్తి సుజయ్ అని, ఇప్పడు బ్రోకర్ ఎవరో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోతున్న పాదయాత్ర టీడీపీ నేతల్లో గుబులు రేపుతోందని మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య విమర్శించారు. బొత్సను విమర్శించే అర్హత మంత్రి సుజయ్కృష్ణకు లేదన్నారు. -
'స్పీకర్ తీరు అత్యంత దురదృష్టకరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి నోటీసులు అందజేశారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. కోడెల స్పీకర్ అయినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా ఉండాల్సింది పోయి టీడీపీ సభ్యుడిగా అనేక సందర్భాల్లో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. 'కోడెల సభాపతి.. అన్నివిధాలా గౌరవంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేందుకు సహకరించారు. సభాపతి పదవి మీద గౌరవంతో మేమంతా సహకరించాం. కానీ ఆయన టీడీపీ సభ్యుడిగా అనేక సందర్భాల్లో వ్యవహరించారు. గత శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా మీద ఎలాంటి చర్య తీసుకున్నారో అందరూ చూశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక తప్పుడు రూల్ కింద రోజా సస్పెన్షన్కు ప్రతిపాదించారు. ఆ రూల్ కింద సంవత్సర కాలం పాటు ఒక సభ్యురాలిని సస్పెండ్ చేసే అధికారం లేదని మేం స్పష్టంగా చెప్పాం' అని సుజయ్కృష్ణ రంగారావు చెప్పారు.