గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో గంటకు పైగా సమావేశమయ్యారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యోచనకు దారి తీసిన పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.
అలాగే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజు జరిగిన అవాంఛనీయ సంఘటనలకు బాధ్యులైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుకు తీసుకున్న చర్యలు, దీనిపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గురించి చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత సమావేశాల సందర్భంగా శాసనసభలో ప్రవేశపెట్టిన అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, విద్యాసంస్థల్లో తెలుగు భాష బోధనను తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లు గురించి గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment