
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌తో సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదివారం సమావేశమయ్యారు. ఇటీవల గవర్నర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో సీఎం ఆయనను కలవడం ప్రాధాన్యం పొందింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బృందం సోమవారం గవర్నర్‌ను కలవనుంది. ఈ క్రమంలో సీఎం గవర్నర్‌తో ప్రభుత్వ వాదనను వినిపించినట్లు తెలిసింది. గవర్నర్ ఢిల్లీ పర్యటన విశేషాలను కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment