చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ సంబరాలు | Congress Ahead In Chattisgarh Assembly Elections | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ సంబరాలు

Dec 11 2018 3:17 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Ahead In Chattisgarh Assembly Elections - Sakshi

రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్ధానాలు దక్కించుకునేలా దూసుకుపోతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్ధానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం కాగా కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 66 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. పాలక బీజేపీని మట్టికరిపించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతోంది. బీజేపీ కేవలం 15 స్ధానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా, బీఎస్పీ 8 స్ధానాల్లో, ఇతరులు ఒక స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

చత్తీస్‌గఢ్‌లో మూడింట రెండొంతులపైగా మెజారిటీ దిశగా హస్తం హవా సాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు పంచుతూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement