ahead
-
ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి..
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జరిగిన అఖిలపక్ష భేటీ ముగిసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అన్ని పార్టీలు ఈరోజు పార్లమెంట్లో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి దేశంలో వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను ప్రభుత్వం కోరింది. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Defence Minister Rajnath Singh is chairing an all-party meeting ahead of the Monsoon Session of Parliament. pic.twitter.com/UnSWa8yMP5 — ANI (@ANI) July 19, 2023 అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ విజయ సాయిరెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఎంపీలు కేశవ రావు, నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశానికి హాజరయ్యారు. కాగా.. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వం పెదవి విప్పనుందని సమాచారం. #MonsoonSession | Central Government informed all parties during the all-party meeting that government is ready to discuss on Manipur issue: Sources — ANI (@ANI) July 19, 2023 ఈ సమావేశాల్లోనే ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ పై బిపార్ల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే.. విపక్షాలు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఎన్నికల సమయం అయినప్పటికీ ప్రజా సమస్యల చర్చ కోసం పార్లమెంటుకు వస్తున్నామని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రం జాన్ చౌదరి తెలిపారు. విపక్షాలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మౌనాన్ని వీడాలని అన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: నేడు అఖిలపక్ష భేటీ.. ఎన్డీయే వర్సెస్ ఇండియాతో ఆసక్తికరంగా.. -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సంబరాలు
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్ధానాలు దక్కించుకునేలా దూసుకుపోతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్ధానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం కాగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 66 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. పాలక బీజేపీని మట్టికరిపించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతోంది. బీజేపీ కేవలం 15 స్ధానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా, బీఎస్పీ 8 స్ధానాల్లో, ఇతరులు ఒక స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో మూడింట రెండొంతులపైగా మెజారిటీ దిశగా హస్తం హవా సాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు పంచుతూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. -
నవంబర్ 15 బ్లాకవుట్ పేరుతో ప్రచారం
-
3800 కు పైగా విమానాలు రద్దు
వాషింగ్టన్ : హైతీలో మాథ్యూ హరికేన్ సృష్టించిన విలయం అమెరికాను, అక్కడి విమానాశ్రయాలను వణికిస్తోంది. దాదాపు 339 మందిని పొట్టన పెట్టుకున్న మాథ్యూ హరికేన్ ప్రకంపనలతో విమానాశ్రయాల్లో కూడా విపత్తు వాతావరణం నెలకొంది. ఈ మృత్యు తుఫాను ఫ్లోరిడా దిశగా పయనిస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సుమారు 3,862 విమానాలను బుధవారం మరియు శనివారం మధ్య రద్దు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు పామ్ బీచ్ విమానాశ్రయాన్ని తెరిచి వుంచినప్పటికీ, ప్రధాన కార్యకలాపాలు స్థంభించాయి. వాణిజ్య విమానాలను నిలిపివేశారు. 2005 సం.రంలో కత్రినా హరికేన్ తర్వాత లాడర్డల్-హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూత పడడం ఇదే మొదటిసారి. మాథ్యూ విలయం కారణంగా గురువారం సాయంత్రం నాటికి మూసివేయబడింది. ఫ్లైట్స్ అవేర్. కాం ప్రకారం దాదాపు 3,862 విమానాలను రద్దు చేశారు. బుధవారం మరియు శనివారం మధ్య రద్దు చేసినట్టు ఎబిసి న్యూస్ రిపోర్ట్ చేసింది. కాగా లెస్ ఆంగ్లాయిస్ ప్రాంతాన్ని ముందుగా తాకిన ఈ మాథ్యూ హరికేన్ అనంతరం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ ను తాకనుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ వార్తలతో ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇసుక తుఫానులా మాథ్యూ తరముకొస్తోంది....ఈ తుఫాను మిమ్మల్మి చంపేసే ప్రమాదం ఉంది, ఒక భూతంలా ముంచుకొస్తోంది జాగ్రత్త పడాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మాథ్యూ తూర్పు తీరంలో విధ్వంసకర ప్రభావాన్ని పడవేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 580 మైళ్ళ అట్లాంటిక్ తీరం అంతటా నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కోరారు. -
రాజ్‌నాథ్ నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
పసిడి పయనం ఎటువైపు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం, వెండి, ప్లాటినం ధరలు పెరగనున్నాయా? విశ్లేషకులు అంచనాలను గమనిస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు పాలసీ సమావేశాల నేపథ్యంలో ప్యూచర్స్ మార్కెట్ లో పసిడి ధరలు పెరిగాయని న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్సేంజ్ తెలిపింది. జూన్ నెల నాటి కాంట్రాక్ట్ లో బంగారం ధరలు 0.83 శాతం పెరిగాయని తెలిపింది. సోమవారం నాటికి ఔన్స్ బంగారం ధర 82 777 రూపాయల దగ్గర స్థిరంగా ఉందని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన నివేదికలో మార్చి నెల గృహ అమ్మకాలు అంచనాల కంటే అధ్వాన్నంగా ఉండటంతో పసిడి ధరలకు ఊతం మిచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే మంగళ, బుధ, గురు, శుక్రవారం విడుదల కానున్న వివిధ అంతర్జాతీయ నివేదికలు పసిడి ధరలను ప్రభావితం చేయనున్నాయని జిన్హువా తెలిపింది. అటు అమెరికా కరెన్సీ డాలర్ క్షీణించడం కూడా గోల్డ్ ధరలకు సానుకూలంకానుంది. గోల్డ్ , డాలర్ సాధారణంగా వ్యతిరేక దిశలో పయనించడం తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయంగా పసిడి ధరలు బలపడుతోంటే.. భారత ఫ్యూచర్స్ మార్కెట్లో కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ అందించిన వివరాల ప్రకారం జూన్ నెల ఫ్యూచర్స్ లో 56 రూ (0,19) క్షీణించి 10 గ్రా. బంగారం ధర 29, 436 దగ్గర స్థిరపడింది. ఇటీవలి లాభాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా నష్టపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర 70 రూపాయల నష్టంతో రూ 29, 192 దగ్గర ట్రేడ్ అవుతోంది. అటు వెండి ధరలో కూడా స్వల్ప క్షీణత నమోదైంది. అదేవిధంగా రేపు ఫెడరల్ రిజర్వు ఏప్రిల్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుంది. దీనిలో కొత్తగా ఫెడ్ ఎలాంటి చర్యలను ప్రవేశపెట్టదని సంకేతాలు వస్తున్నాయి. కానీ మానిటరీ పాలసీపై ముందస్తు మార్గదర్శకాలు, భవిష్యత్ లో వడ్డీరేట్లు పెరుగుతాయనే సూచనలను ఫెడ్ ప్రకటిస్తుందని డీలర్లు ఆశిస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో పసిడి పరుగులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మోదీని మించిన షారుఖ్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్విట్టర్లో దూసుకుపోతున్నాడు. తాజాగా ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని నరేంద్రమోదీని ఆయన అధిగమించారు. ప్రస్తుతం షారుఖ్ 16 మిలియన్ల ఫాలోవర్లతో ఇండియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న వారిలో రెండవ స్థానంలో నిలిచారు. మోదీ 15.8 మిలియన్ల ఫాలోవర్లతో 3వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 17.6 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇండియాలో అసహనం తీవ్రంగా ఉందన్న షారుఖ్ వివాదాస్సద ప్రకటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2010 జనవరి 3న ట్విట్టర్లో జాయిన్ అయిన షారుఖ్.. క్రమం తప్పకుండా అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ అంతకంతకూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు. షారుఖ్ ప్రస్తుతం కాజోల్ హీరోయిన్గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో దిల్వాలే చిత్రంలో నటిస్తున్నాడు. -
సచిన్ చివరి మ్యచ్‌ను వీక్షించనున్న ఫ్యామిలీ