
కైసర్‌గంజ్ (యూపీ) : దేశం రాజకీయ ప్రమాణాలు, విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడి.. తిట్లు, దూషణలతో దేశంలోని వాతావరణాన్ని కలుషితం చేసేస్తున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశారు. మోదీ, యోగి కుటుంబసభ్యులను ఆయన వీధి ఆవులతో పోల్చారు. వీధి ఆవులు, ఎద్దుల వల్ల రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్ కిషన్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఎంపీ పోటీచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు వినయ్‌కుమార్ పాండే విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రజలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు రోడ్ల మీద తిరిగే ఆవుల్ని, ఎద్దుల్ని చూస్తుంటారు. అవి ప్రయాణికులకే కాదు రైతులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. కార్లలో వెళ్లే ప్రజలు వాటిని చూసినప్పుడు.. ‘చూడండి యోగి, మోదీ అత్తలు కూర్చున్నార’ని అంటారు. కొందరేమో అవి వారి చెల్లెళ్లు అంటే.. మరికొందరు అక్కడ ఉన్నది మోదీ, యోగి తల్లి అని, తండ్రి అని అంటూ ఉంటారు’ అని పాండే వికృత వ్యాఖ్యలు చేశారు. ‘ఖాకీ’ లోదుస్తులు ధరించిందంటూ జయప్రదపై ఎస్పీ నేత ఆజంఖాన్ తీవ్ర అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత ఉమాభారతి కూడా ప్రియాంకగాంధీని ‘దొంగోడి భార్య’అని అభివర్ణిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment