
సాక్షి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు చెంపపెట్టు లాంటివని మహబూబ్నగర్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ది వంశీచందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమ వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందటానికి నిజామాబాద్లో 250 మంది రైతులు నామినేషన్లు వేయటమే నిదర్శనమన్నారు.
ఈవీఎం మిషన్స్ నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్, బ్యాలెట్ పత్రాలతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలు గెలుస్తున్నాయి. దీనిని ప్రజలు, అధికారులు గమనించాల్సిన అంశమని ఆయన తెలిపారు.