మాకు 9 స్థానాలు కేటాయించాల్సిందే: చాడ | CPI Demand To Mahakutami For 9 Assembly Tickets | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

CPI Demand To Mahakutami For 9 Assembly Tickets - Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: మహాకూటమిలో భాగంగా తమ పార్టీకి రెండు, మూడు స్థానాలు కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా 12 స్థానాలు కోరామని, తొమ్మిది స్థానాలు ఇస్తేనే అంగీకరిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలోని 40 స్థానాల్లో సీపీఐకి పూర్తిస్థాయిలో పట్టు ఉందని, ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తామని చెప్పారు. తాను హుస్నాబాద్‌ నుంచి పోటీ చేస్తానని చాడ ప్రకటించారు. మహాకూటమితో టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌పై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణ ఉద్యమకారులను ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement