![Chada Venkat confident of CPI win - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/9/CHADA-2.jpg.webp?itok=NGgrbdb0)
సాక్షి, హైదరాబాద్: మహా కూటమిలో 3 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎమ్మెల్సీలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ తమకు 5 అసెంబ్లీ స్థానాలు కావాలని కాంగ్రెస్‌ను కోరుతున్నట్టుగా చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సీట్లకోసం చర్చలు జరుపుతున్నారని చెప్పారు. హుస్నాబా ద్, బెల్లంపల్లి, వైరా స్థానాలను సీపీఐకి ఇచ్చినట్టు చెబుతున్నారని, బెల్లంపల్లికి బదులు మం చిర్యాల కావాలని తాము కోరుతున్నామన్నారు. కాగా, సీపీఐకి 3 అసెంబ్లీ స్థానాలను కేటాయిం చినట్టు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం నేడు సమావేశం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment