
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం పోలింగ్ జరిగే వరకు సోషల్ మీడియాలో, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రచారాన్ని నిషేధించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో టీడీపీ నుంచి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
పోలింగ్‌కు 48 గంటల ముందు సోషల్ మీడియాలో ప్రచారం జరక్కుండా ఈసీ నియంత్రించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఈవీఎంలకు తప్పనిసరిగా వీవీప్యాట్‌లను జతపర్చాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు చట్టం తీసుకురావాలని కోరారు.