సాక్షి, హైదరాబాద్ : అవకాశవాద పొత్తులకు టీడీపీ మళ్లీ తెరలేపింది. టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యమని చెబుతూ తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు బద్ధవిరోధి కాంగ్రెస్‌తో పొత్తుకూ బరితెగించింది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపామని విపక్షాలు ప్రకటించాయి. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ముందుకెళతామని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ స్పష్టం చేశాయి. మంగళవారం పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన సమావేశంలో పొత్తులపై ప్రాథమిక చర్చలే జరిగాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
మహాకూటమిలో ప్రజా సంఘాలనూ, విద్యార్థి సంఘాలను కలుపుకుని వెళతామన్నారు. మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రజల ముందుంచుతామన్నారు. కేసీఆర్‌లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.
విపక్షాల పొత్తుతో కేసీఆర్‌కు చెక్ పెడతామని టీటీడీపీ నేత ఎల్ రమణ అన్నారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవ్వరితో చర్చలు జరపకుండా అసెంబ్లీని ఆదరాబాదరాగా రద్దు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కుతోందన్నారు. కాగామహాకూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment