
సాక్షి, విజయవాడ : తాము అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం రాజ« దాని విజయవాడలో సాధారణ మహిళలకే కాదు.. అధికార పార్టీ మహిళా ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకుండా పోయింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతే సాక్షాత్తు మహిళా ప్రజా ప్రతినిధిని వేధించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
మహిళా కార్పొరేటర్‌పై వెకిలి చేష్టలు...
వన్ టౌన్‌కు చెందిన ఓ టీడీపీ మహిళా కార్పొరేటర్ తన డివిజన్ సమస్యల గురించి ఆ పార్టీ సీనియర్ నేతకు చెప్పింది. తన వద్దకు పర్సనల్‌గా వచ్చి చర్చించాలని చెప్పారు. దీంతో ఆయన వద్దకు వెళ్లిన ఆమెను అసభ్య పదజాలంతో సంభోదిస్తూ వెకిలి చేష్టలు చేశాడు. పైకి ఎంతో హుందాగా కనపడే ఆ నాయకుడు ఇలా వ్యవహరించడంపై ఆ పార్టీ కార్యకర్తలు నివ్వెర పోతున్నారు. మహిళా కార్పొరేటర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలుసుకున్న ఆమె భర్త మరి కొంతమంది కార్యకర్తలు ఆ నాయకుడిని చొక్కా పట్టుకుని నాలుగు తగిలించేందుకు సిద్ధమయ్యారు.
ఎంపీ కార్యాలయానికి చేరిన వివాదం...
అయితే, విషయం ఎంపీ కార్యాలయానికి చేరింది. దీంతో కార్యాలయ ప్రతినిధులు ఆ మహిళా ప్రతినిధి, ఆమె భర్తను పిలిపించి బుజ్జగించారు. ఇటువంటి ఘటనలు పునరావృ తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సర్ధి చెప్పారు. పార్టీ పరువు రోడ్డున పడుతుందని, ప్రజల్లో చులకనైపోతుందంటూ అర్బన్ పార్టీ నేతలు కొందరు బతిమలాడటం తో వివాదాన్ని ముగించారు. ఇదిలా ఉండగా నైతిక విలువలను పక్కన పెట్టి పార్టీ మార్చిన మరో నేత తీరుపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. సమస్యలు చెప్పుకోవడానికి ఆయన వద్దకు వెళ్లే మహిళలు మరొకసారి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment