
మంత్రి కేటీఆర్
సాక్షి, కోదాడ: కేటీఆర్ ప్రభంజనం చూసి ప్రతిపక్ష నాయకులకు జ్వరాలు వస్తున్నాయని మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకర్గ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ఆకాశానికెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన యువకెరటం కేటీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచంలో 50 దేశాల్లో కేటీఆర్ ప్రాధ్యాన్యత వున్నదని, అభిమానులూ వున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నాయకుల గురించి మంత్రి కేటీఆర్ వున్నది ఉన్నట్టుగా చెబుతూ అలీబాబా గుంపు అన్నారని గుర్తుచేశారు. దేశంలో ఎన్నికల మ్యానిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనని అన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని నియోజకర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ, 2 స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.