జేడీఎస్‌-కాంగ్రెస్‌ అత్యవసర భేటీ | JDS Congress To Conduct Joint Legislative Meeting | Sakshi
Sakshi News home page

జేడీఎస్‌-కాంగ్రెస్‌ అత్యవసర భేటీ

Published Sat, May 19 2018 6:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

JDS Congress To Conduct Joint Legislative Meeting - Sakshi

సాక్షి, బెంగళూరు: బలపరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిన దరిమిలా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు జేడీఎస్‌-కాంగ్రెసలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఇరుపార్టీలు ఉమ్మడిగా లెజిస్లేటివ్‌ భేటీని నిర్వహించాయి. బెంగళూరులోని హిల్టన్‌ హోటల్‌లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్‌ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు వీరేనంటూ కొన్నిపేర్లు కూడా వెల్లడయ్యాయి. మరోవైపు సోమవారం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది.
(చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement