
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు. పోలవరంకు కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. పోలవరం విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు సర్కారు పాపాలను ప్రజలు భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలకు ఏపీ నిలయంగా మారిందని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వరా? రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను, ఉద్యోగులను, నష్టపోయిన రైతులను కలవాలంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతోందని ఆయన నిలదీశారు. కృష్ణా జిల్లా మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని పార్థసారధి ఘాటుగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment