
సాక్షి, బెంగళూరు : బలపరీక్ష నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మైసూర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. అనంతరం యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.
తిరిగి ప్రారంభమైన తర్వాత అసెంబ్లీలో అనూహ్య దృశ్యం కనిపించింది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు అసెంబ్లీ గ్యాలరీలో పక్కపక్కనే కూర్చొని కనిపించారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్, బీజేపీ నుంచి సదానందగౌడ, అనంతకుమార్, శోభా కర్లందాజే పక్కపక్కనే కూర్చొని.. సరదాగా మాట్లాడుతూ.. నవ్వులు చిందించడం కనిపించింది. ఇక కాంగ్రెస్ ‘మిస్సింగ్’ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ పక్కన కూర్చోవడం గమనార్హం.