సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19 నుంచి నియోజకవర్గాలవారీగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలిదశలో భాగంగా రెండు రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
ఆ తర్వాత వరుసగా సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రచార సభల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే రోజు నుంచి ఆయన వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటారని వెల్లడించాయి.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బట్టి వ్యూహం...
నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యే నవంబర్ 19 నాటికి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. దీంతో అదే రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గాల్లోని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను పరిశీలించి, ఆ మేరకు ప్రచార వ్యూహం అమలు చేయనున్నారు. ప్రచారం ప్రారంభించేలోపే పూర్తిస్థాయి ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
కేసీఆర్ బహిరంగ సభల షెడ్యూల్ ఇదే...
19 నవంబర్
మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలో పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల సభ
మధ్యాహ్నం 3.30 గంటలకు జనగామ జిల్లా పాలకుర్తిలో బహిరంగ సభ
20 నవంబర్
మధ్యాహ్నం ఒంటి గంటకు సిద్ధిపేటలో సిద్ధిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల సభ
మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూరాబాద్‌లో బహిరంగ సభ
3.30 గంటలకు సిరిసిల్లలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల సభ
4.30 గంటలకు ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గస్థాయి బహిరంగ సభ
Comments
Please login to add a commentAdd a comment