open meeting
-
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. 25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న బహిరంగ సభలలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం
దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డుకొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయాలని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్త గుడివాడ కనిపిస్తోంది ♦ ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్లో నివాసం ఉండబోతున్నారు. ♦ ఈ లేఅవుట్‌తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా. ♦ ఈ లేఅవుట్ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ♦ ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ♦ ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం ♦ ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్‌కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది. ♦ రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్‌కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. ♦ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ♦ 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. ♦ 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్‌ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. పేదల వ్యతిరేకి చంద్రబాబు ♦ నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ♦ అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ♦ మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం. ♦ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేశాం. గుడివాడకు వెన్నుపోటు అల్లుడు ♦ ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు. ♦ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. ♦ ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు. ♦ ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఊరూరా విప్లవాత్మక మార్పులు ♦ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ♦ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, ఫిషింగ్ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. ♦ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్‌ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు. వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి. గుడివాడకు వరాల జల్లు గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం. మల్లాయపాలెం లే అవుట్లో ఇంటర్నల్ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పైప్‌లైన్ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం. మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
లక్ష మందితో అమిత్‌షా సభ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈనెల 15న ఖమ్మం వస్తున్న నేపథ్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, జిల్లా నేతలతో కలిసి శుక్రవారం ఆయన ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, పక్కనే ఉన్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షా మొదటిసారి ఖమ్మంలో పర్యటిస్తుండటంతో జనం పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని, అందుకే సువిశాల ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాన్ని ఎంపిక చేశామని చెప్పారు. సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలో పిల్లలతో బండి సంజయ్ సరదగా ఫుట్‌బాల్ ఆడారు. స్టేడియం పక్కనే ఉన్న కేఫ్‌లో కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు. బీజేపీ సింగిల్‌గా పోటీ చేస్తుంది.. అంతకుముందు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నేతలతో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కమ్యూనిస్టులను కేసీఆర్ విమర్శించినా.. వారు మాత్రం బీఆర్ఎస్ పంచనే చేరుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేస్తుందని, అందరూ కష్టపడి పనిచేసి కాషాయ రాజ్య స్థాపనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎం.ధర్మారావు, కొండేటి శ్రీధర్, కుంజా సత్యవతి, నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, సినీనటి కవిత, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు చిన్ని పాల్గొన్నారు. -
24న ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ సభ
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 24న బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రాధాన్యమిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండు సభలను నిర్వహించగా.. తాజాగా మూడో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేదిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పా ర్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీజేపీ, శివసేనతోపాటు ఎన్సీపీ, శివసంగ్రామ్పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు. షెట్కారీ సంఘటన్ నేత శరద్ ప్రవీణ్జోషి, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్తోపాటు వివిధ పా ర్టీల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. గ్రామ స్థాయిలో బలోపేతానికి ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతోపాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై బీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రధానంగా లాతూర్, నాందేడ్, యవత్మాల్, చంద్రాపూర్, షోలాపూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, నాసిక్ జిల్లాలపై ఫోకస్ చేసింది. పా ర్టీలోకి చేరికలు కూడా ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ తొలిసభను నిర్వహించగా.. మార్చి 6న కాంధార్–లోహలో రెండో సభ జరిగింది. తాజాగా ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తర్వాత షోలాపూర్‌లో.. ఔరంగాబాద్ తర్వాత మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం లేదా పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లో భాగమైన షోలాపూర్‌ను ఎంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చేరికలను కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా.. పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీతోపాటు, బీఆర్ఎస్ రైతు విభాగం మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్ కదమ్ తదితరులు చేరికలు, పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ మహారాష్ట్ర నేతల చేరికలను సమన్వయం చేస్తున్నారు. అంకాస్ మైదానంలో బహిరంగ సభ ఔరంగాబాద్ సభకు సంబంధించి మహారాష్ట్రలోని కన్నడ్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే, హర్షవర్ధన్ జాదవ్, సీనియర్ నాయకులు అభయ్ కైలాస్‌రావు పాటిల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఔరంగాబాద్ సభ జరుగుతున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రకటించారు. -
మరో ‘మహా’సభపై బీఆర్ఎస్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో కార్యకలాపాల విస్తరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 5న నాందెడ్‌లో జరిగిన తొలి సభ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నెల 26న నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలోని కాందార్ లోహలో సైతం భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ సభకు అధ్యక్షత వహించనుండటంతో జన సమీకరణను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లక్షకు మందికిపైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభ ద్వారా లాతూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్ల బాధ్యతను తెలంగాణ పీయూసీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, పార్టీ మహారాష్ట్ర శాఖ కిసాన్‌సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ మోడల్‌కు ప్రాధాన్యత... కాందార్ లోహ బహిరంగ సభకు జన సమీకరణ కోసం కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసేందుకు 20 ప్రచార రథాలు, 16 డిజిటల్ స్క్రీన్ ప్రచార వాహనాలను ఉపయోగిస్తోంది. 16 తాలూకాల పరిధిలోని 1,600 గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ ప్రచార రథాలను ఉపయోగిస్తోంది. ఓవైపు తెలంగాణ మోడల్‌కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను వీడియోలు, ఇతర ప్రచార సామగ్రి రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికను అమలు చేస్తోంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సభా వేదిక ద్వారా ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికల కోసం కసరత్తు జరుగుతోంది. సభలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరతారని చెబుతున్నా క్షేత్రస్థాయి కేడర్‌ను చేర్చుకొనేందుకే పార్టీ ప్రాధాన్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి నాందెడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక ఎన్నికలపై నజర్... త్వరలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై ఎలాంటి కదలికలు లేకున్నా అక్కడి రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. కర్ణాటక రాజకీయాలపై సర్వే సంస్థల ద్వారా ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక రాజకీయాల పరిశీలనకు త్వరలో సీఎం కేసీఆర్ ఒక బృందాన్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
మాది న్యూట్రిషన్ మీది పార్టిషన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్ అని.. తమవి న్యూట్రిషన్ పాలిటిక్స్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని మహిళల ఆరోగ్యం కోసం ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించ తలపెట్టిన ఎనిమిది రకాల వ్యాధులు, 57 టెస్టులతో కూడిన ‘ఆరోగ్య మహిళ’పథకానికి మంత్రి హరీశ్‌రావు కరీంనగర్లో బుధవారం శ్రీకా రం చుట్టారు. అనంతరం మార్క్‌ఫెడ్ గ్రౌండ్లో జరి గిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం హిందూ–ముస్లిం అంటూ ప్రజలను విభజి స్తూ పాలిస్తూ.. పార్టిషన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ అడిగినా ప్రైవేటు కాలేజీలను సాకుగా చూపి అను మతి నిరాకరించిందన్నారు. తాము మాత్రం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రారంభిస్తున్నామన్నారు. 50 శాతం మంది మహిళలకు.. తెలంగాణలోని 50 శాతం మంది మహిళలు కేన్సర్, రక్తహీనత, గర్భసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని హరీశ్‌రావు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యను భర్తకు చెప్పుకోలేక చిన్న సమస్యను పెద్దగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్‌తో గర్భిణులకు విశేష సేవలు అందుతున్నాయన్నారు. మహిళా ఆరోగ్యం పేరుతో మహిళలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని చెప్పారు. మెరుగైన సేవల కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 8 రకాల సమస్యలకు 8 వార్డులను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ మెషీన్ అందుబాటులోకి తెస్తామని, సమస్య పెద్దది కాకముందే మహిళలు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఆరోగ్యమహిళ, న్యూట్రిష న్ కిట్స్, రూ.750 కోట్లవడ్డీలేని రుణాలు విడుదల చేసి మూడు కానుకలను అందజేశారన్నారు. రెండో దశ వడ్డీలేని రుణాలను జూన్ లేదా జూలైలో అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శ్రీరామనవమి తరువాత న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య మహిళలో భాగంగా మొత్తం 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య మహిళ ద్వారా పరిష్కారం లభిస్తుందని హరీశ్‌రావు చెప్పారు. రెఫరల్ ఆసుపత్రుల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ మంగళవారం పూర్తిగా మహిళా వైద్య సిబ్బంది ఉండి వైద్యం అందిస్తారని.. ప్రస్తుతం 100 ఆసుపత్రులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో 1200 సెంటర్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అటెండర్ నుంచి డాక్టర్ దాకా ఆ క్లినిక్‌లో అంతా మహిళలే ఉంటారన్నారు. శ్రీరామ నవమి తరువాత రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్స్ అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కా లని పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీడీపీ నేతలు ఉప్పెనలా బీజేపీలోకి తరలిరావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బాబు బాగుండాలి: గరికపాటి ఎన్టీఆర్ చూపిన అభిమానంతో టీడీపీలో చేరానని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నానని ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. మనసు రాయి చేసుకొని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలు వీరే... గరికపాటి మోహన్‌రావు–రాజ్యసభ సభ్యుడు, శోభారాణి–తెలుగు మహిళ అధ్యక్షురాలు, దీపక్‌రెడ్డి–టీడీపీ జనరల్ సెక్రటరీ, ఈగ మల్లేశం–వరంగల్ రూరల్ అధ్యక్షుడు, రజనీకుమారి–తుంగతుర్తి ఇన్చార్జి, పోరిక జగన్ నాయక్–మాజీ మంత్రి, ఎర్ర శేఖర్–మాజీ ఎమ్మెల్యే, మొవ్వ సత్యనారాయణ–శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి, ముజఫర్–మలక్‌పేట్ టీడీపీ ఇన్చార్జి, సామ రంగారెడ్డి–రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కోనేరు చిన్ని–కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్–పఠాన్ చెరు ఇన్చార్జి, బోట్ల శ్రీనివాస్–జనగామ జిల్లా అధ్యక్షుడు, రాజ్యవర్ధన్రెడ్డి–కాంగ్రెస్ నేత, శ్రీనివాస్‌గౌడ్–నల్లగొండ ఇన్చార్జ్, అంజయ్య యాదవ్–నాగార్జున సాగర్ అసెంబ్లీ ఇన్చార్జి, సాధినేని శ్రీనివాస్–మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్చార్జి, శ్రీకళారెడ్డి–కోదాడ నేత, ఓం ప్రకాశ్ మాజీ తెలుగు విద్యార్థి నేత, బాబురావునాయక్–టీడీపీ ఎస్టీ సెల్, విజయ్‌పాల్‌రెడ్డి–మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్, ఉపేందర్–కాంగ్రెస్ నేత, సత్యం–మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు, రఘునాథ్‌రెడ్డి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రామ్‌రెడ్డి–సూర్యాపేట ఇన్చార్జి, జయశ్రీ–టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. -
వరాల జల్లు
‘ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతాం. పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో.. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల మేర సాగు నీరు అందిస్తాం. సాధ్యమైనంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తాం. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తెస్తాం. అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తా. రంజిత్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి’ – వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ వికారాబాద్: ఉమ్మడి జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. వికారాబాద్‌లోని కలెక్టరేట్ నూతన భవనం సమీపంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగుల డిమాండ్ మేరకు జోన్‌ను మార్చేస్తామని తెలిపారు. తాను 1985లో అనంతగిరికి వచ్చానని, అప్పుడే అనంతగిరి గొప్పతనం తెలుకున్నానని చెప్పారు. ఎన్నో ఔషధ మూలికలు ఉన్నాయి కాబట్టే అప్పటి నిజాం నవాబు ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందించారని తెలిపారు. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. జిల్లాలో అనేక సమస్యలున్నాయని.. తానే స్వయంగా వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చదువుకున్న వ్యక్తి, బహుభాషా కోవిధుడని తెలిపారు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి లక్ష ఓట్ల మెజార్టీ అందించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనను ఎప్పుడు కలిసినా 111 జీఓను ఎత్తివేయాలని కోరుతున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ ఇస్తే అంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతగిరిని అభివృద్ధి చేస్తా... జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని సీఎం స్పష్టంచేశారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు లక్ష ఎకరాల చొప్పున సాగు నీరు ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతగిరి తెలంగాణ రాష్ట్రానికే ఊటీలాగ ఉంటుందని, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం హామీలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. చప్పట్లు కొడుతూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, రాంచంద్రారెడ్డి, భూమోళ్ల కృష్ణయ్య, తాండూరు విజయ్‌కుమార్, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
మళ్లీ వస్తా.. రెండు రోజులుంటా..
‘దేశానికి కశ్మీర్ ఎట్లనో.. మన తెలంగాణకు ఉమ్మడి ఆదిలాబాద్ అట్ల. సహజసంపదలున్న జిల్లాను ఒకటిన్నర సంవత్సరాల్లో కశ్మీర్ లెక్క కళకళలాడేలా చేస్తా. ఇది నా బాధ్యత. ఎంపీ ఎన్నికల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తా. ఇక్కడి ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేస్తా. అన్నివర్గాల సమస్యలను దూరం చేస్తా. ఆదిలాబాద్ ఓటర్లు మన నగేశ్‌ను మూడులక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న..’ నిర్మల్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం సాయంత్రం సీఎం కేసీఆర్ నిర్మల్ వచ్చారు. జిల్లాకేంద్రంలో ని ఎల్లపెల్లి క్రషర్‌రోడ్డులో గల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన సరిగ్గా సాయంత్రం 5గంటల 10నిమిషాలకు సభాస్థలికి చేరుకున్నారు. 5.12కు ప్రసంగాన్ని ప్రారంభించి, 5.47 వరకు ముగించారు. మొత్తం 35నిమిషాల పాటు సీఎం ప్రసంగం కొనసాగింది. ముందుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేశ్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యేలు జోగురామన్న, విఠల్‌రెడ్డి, బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సీఎం ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల పాటు రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. రాత్రిపూట పాములు, తేళ్ల మధ్య పొలానికి పోవడం, కరెంటు షాకుల కష్టం పోయేలా చేశామన్నారు. అన్నివర్గాల వారి పింఛన్లను పెంచామని, ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ బీడీ కార్మికులు ఉన్నారని పీఎఫ్ ఉన్న వారందరికీ పింఛన్ అందించనున్నామని పేర్కొన్నారు. రైతుబంధు సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.పదివేలకు పెంచుతున్నామన్నారు. నాణ్యమైన చదువులు, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం, 24గంటల కరెంటు, పింఛన్లు.. ఇలా ఇవన్నీ ప్రజల కండ్ల ముందే ఉన్నాయని పేర్కొన్నారు. జిందగీలా జిల్లా కాకుండే.. తెలంగాణ ఏర్పడటం వల్లే అభివృద్ధి సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేశ్ తమ జిల్లాలో బెజ్జూరు నుంచి ఆదిలాబాద్, బాసర నుంచి ఆదిలాబాద్‌కు పోవాలంటే కష్టమవుతుందని నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు తీర్చేతందుకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్లుగా నాలుగు జిల్లాలు చేసినమన్నారు. తెలంగాణ ఏర్పడకుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకుంటే.. జిందగీలా నిర్మల్ జిల్లా కాకుండే.. అని పేర్కొన్నారు. కశ్మీర్‌లా కళకళలాడాలె.. దేశానికి కశ్మీర్ ఎలాగో.. తెలంగాణకు ఉమ్మడి జిల్లా అలాంటిదని సీఎం అభివర్ణించారు. సహ జసిద్ధమైన వనరులు, వనసంపద ఉన్న జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టులో భాగంగా 27, 28 ప్యాకేజీల్లో భాగంగా ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు, ముథోల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు.. మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి ప్రాజెక్టు కూడా చేపడుతున్నామని, మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకూ సాగునీటిని అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టులన్నింటిని సద్వినియోగం చేసేలా చూస్తామని, ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ను కశ్మీర్‌లా కళకళలాడేలా చేస్తామని వివరించారు. ఇది తన బాధ్యతని కేసీఆర్ హామీ ఇచ్చారు. బర్రునచ్చి.. బుర్రున పోను.. మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు ఫేస్బుక్లో వీడియో పెడితే, వెంటనే స్పందించి పరిష్కరించానని సీఎం సభలో పేర్కొన్నారు. అందరి లెక్క ఆల్తూ..ఫాల్తూ ముచ్చట్లు చెప్పుడు ఇష్టం లేదని.. జూన్ తర్వాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తమని వెల్లడించారు. భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తామని చెప్పారు. రైతులకు సంబంధించిన భూసమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎన్నికల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తానని చెప్పారు. ఇప్పటి లెక్క.. బర్రునచ్చి బుర్రున పోనని, రెండుమూడు రోజుల ఇక్కడనే ఉంటానన్నారు. సీఎస్‌తో సహా అందరు అధికారులు, మంత్రివర్గమంతా తనతో ఇక్కడే ఉంటుందన్నారు. రైతులు నెల రోజులు ఓపిక పట్టాలని, భూసంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. రైతులందరికీ గిట్టుబాటు ధరలు అందేలా చేస్తామన్నారు. 1996లోనే సత్తెన్నతో చెప్పిన.. సీఎం కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వి.సత్యనారాయణగౌడ్‌ను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడితే సమస్యలన్నీ దూరమైతాయని తాను 1996లోనే కడ్తాల్ సత్యనారాయణతో చెప్పానని సీఎం గుర్తుచేశారు. అప్పట్లో తాను ఎస్సారెస్పీకి వచ్చినప్పుడు సత్యనారాయణగౌడ్ మరికొందరితో కలిసి డ్యామ్‌పై నడుచుకుంటూ వెళ్లామని చెప్పారు. అప్పుడే తెలంగాణ కోసం ఉద్యమం గురించి మాట్లాడుకున్నామన్నారు. బతికుంటే తానే ఉద్యమం చేస్తానని సత్తెన్నతో చెప్పానని సీఎం పేర్కొన్నారు. 2001లో జెండా పట్టుకుంటే ముందుగా ఎవరూ రాలేదని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి చేరడంతో ఉద్యమం బలపడిందన్నారు. స్వరాష్ట్రం సాధించుకోవడం వల్ల పేదలకు, వృద్ధులకు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు పింఛన్లను ఇచ్చి కడుపు నింపుతున్నామన్నారు. న్యాయం చేస్తా.. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు, పథకాల లొల్లి పడి ఆదిలాబాద్ జిల్లాకు రాలేకపోయానని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఆదిలాబా ద్, నిర్మల్‌లకు వస్తానని, రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి అభివృద్ధి పనులు చేయిస్తానని హా మీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డలకు న్యా యం చేస్తానన్నారు. పోడు భూములు, ఏజెన్సీలో గిరిజనేతరుల భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో మైనార్టీ ముస్లింల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. అన్నివర్గాలను అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుం దన్నారు. గత ఎన్నికల్లో జిల్లాకు వచ్చి కోరితే.. తొమ్మిది మందిఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాననీ, లోక్‌సభ ఎన్నికల్లో పనిమంతుడైన గోడం నగేశ్‌ను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈసారి 3లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. భారీ బందోబస్తు సభకు ఎస్పీ శశిర్రాజు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఎం హోదాలో తొలిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన కేసీఆర్ కార్యక్రమానికి అంచెలంచెలుగా భద్రత ఏర్పాట్లు చేశారు. సభలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణగౌడ్, కే. శ్రీహరిరావు, రాంకిషన్‌రెడ్డి, అరిగెల నాగేశ్వర్రావు, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, ధర్మాజీగారి రాజేందర్, పాకాల రాంచందర్, డాక్టర్ స్వర్ణారెడ్డి, శ్యాంసుందర్, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. -
సోనియా పర్యటన రద్దు
యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చి లబ్ధిపొందాలనుకున్న కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పూడురు మండలంలోని మీర్జాపూర్లో ఆదివారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగా సోనియా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రచారానికి ఎదురు దెబ్బ తగిలింది. సోనియాగాంధీ పర్యటన రద్దయింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ రాలేదు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక్కరే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించటంతోపాటు కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రచారంలో గులాబీ నేతలు దూసుకుపోతుంటే హస్తం శ్రేణులు కొంత వెనకబడ్డాయి. దీన్ని అధిగమించేందుకు లక్ష మందితో సోనియాసభ నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని కొండా భావించారు. ఈ మేరకు మిర్జాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ జన సమీకరణ కోసం సర్వం సిద్ధం చేశారు. అనుకోకుండా సోనియా పర్యటన రద్దు కావడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె వస్తే చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో విజయావకాశాలు మెరుగయ్యేవని చెబుతున్నారు. సోనియ రాకపోవటం ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆమె పర్యటన రద్దు కావడంతో కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. జాతీయ నాయకుల రాక.. సోనియా పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్ నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పలువురు జాతీయ నాయకులను ఆహ్వానించారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, గులాంనబీ ఆజాద్, జ్యోతిరాధిత్య సింథియా, ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, సినీనటుడు చిరంజీవి తదితరులు హాజరై ప్రసంగించనున్నారు. సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మందితో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. మీటింగ్ సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేస్తాం... చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని, ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోనియా పర్యటపై ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల యూపీఏ చైర్పర్సన్ సోనియా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మిర్జాపూర్‌లో లక్షమందితో యథావిధిగా బహిరంగసభ జరుగుతుందన్నారు. దీనికి సచిన్ పైలెట్, ఆజాద్, విజయశాంతి తదితరులు హాజరుకానున్నట్లు చెప్పారు. -
19 నుంచి కేసీఆర్ బహిరంగ సభలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19 నుంచి నియోజకవర్గాలవారీగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలిదశలో భాగంగా రెండు రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత వరుసగా సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రచార సభల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే రోజు నుంచి ఆయన వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటారని వెల్లడించాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బట్టి వ్యూహం... నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యే నవంబర్ 19 నాటికి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. దీంతో అదే రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గాల్లోని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను పరిశీలించి, ఆ మేరకు ప్రచార వ్యూహం అమలు చేయనున్నారు. ప్రచారం ప్రారంభించేలోపే పూర్తిస్థాయి ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కేసీఆర్ బహిరంగ సభల షెడ్యూల్ ఇదే... 19 నవంబర్ మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలో పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల సభ మధ్యాహ్నం 3.30 గంటలకు జనగామ జిల్లా పాలకుర్తిలో బహిరంగ సభ 20 నవంబర్ మధ్యాహ్నం ఒంటి గంటకు సిద్ధిపేటలో సిద్ధిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల సభ మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూరాబాద్‌లో బహిరంగ సభ 3.30 గంటలకు సిరిసిల్లలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల సభ 4.30 గంటలకు ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గస్థాయి బహిరంగ సభ -
ఎన్ని ఊళ్లు తిరిగారు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలతో ప్రజల్లో స్పందన ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. వివిధ మార్గాల్లో దీనిపై సమాచారం సేకరిస్తున్నారు. పలు సర్వే సంస్థలకు ఈ పని అప్పగించారు. అన్ని రకాల సమాచారం అందిన తర్వాత తదుపరి ప్రచార కార్యాచరణ రూపొందించనున్నారు. వరుసగా మూడు రోజులపాటు నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిలో బహిరంగ సభలను ముగించిన కేసీఆర్ శనివారం పార్టీ ప్రచార సరళిని సమీక్షించారు. బహిరంగ సభలు జరిగిన ఉమ్మడి జిల్లాల్లోని నేతలతో ఫోన్లో మాట్లాడారు. సభల నిర్వహణతో ప్రచారంపై ఎలాంటి చర్చ జరుగుతోందని ఆరా తీశారు. టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నేతల అభిప్రాయం ఎలా ఉందని అడిగారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం వరంగల్‌లో, సోమవారం ఖమ్మంలో బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్లో నెలకొన్న అసమ్మతి కారణంగా వీటిని రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతుల వ్యవహారానికి ముగింపు పలకగానే వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రెండుమూడు రోజుల్లో ఈ సభల తేదీలను ప్రకటించనున్నారు. వీటిని ప్రకటించేలోపే రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతులకు పూర్తిగా ముగింపు పలకాలని నిర్ణయించారు. అప్పటికీ దారికిరాని వారి విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతల జాబితాను రూపొందించాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమాచారం ఆధారంగా ఈ జాబితా ఉండాలని స్పష్టం చేశారు. పల్లా ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పే పేర్లనే అసమ్మతి జాబితాలో చేర్చుతున్నట్లు పలువురు టీఆర్ఎస్ వ్యవస్థాపక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతలు తమతో ఒకసారి మాట్లాడితే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని వారు అంటున్నారు. వేగం పెంచాలి... టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార సరళిపైనా కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్థుల ప్రచారతీరుపై సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం పలువురు అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించే ప్రచార వ్యూహంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, అభివృద్ధి పనులను గ్రామాలవారీగా తెలియజేయాలని సూచిస్తున్నారు. నియోజకవర్లాల్లో ఎన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారని అభ్యర్థులను అడిగి తెలుసుకుంటున్నారు. అక్టోబర్ 9లోపు నియోజకవర్గ వ్యాప్తంగా తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. తొలిదశ ప్రచారంపై గతంలోనే ఆదేశాలు జారీ చేశామని... నగర, పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోని ప్రచారం ఆశించిన విధంగా సాగడంలేదని పలువురు అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా తొలిదశ ప్రచారం పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో జాబితా సిద్ధం... పెండింగ్‌లో పెట్టిన 14 స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపిక చేసిన అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలపై సర్వేలు చేస్తోంది. రెండుమూడు రోజుల్లోనే ఈ జాబితాను సైతం ప్రకటించనుంది. అక్టోబర్ 10న పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. -
మోదీ నాలుగేళ్లలో ముస్లింలకు ఏం చేశారు
గద్వాల జిల్లా : బీజేపీ ప్రవేశ పెట్టిన త్రిబుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం శోచనీయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వైఎస్సార్ చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ..త్రిబుల్ తలాక్ గురించి మాట్లాడుతున్న మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లిం మహిళలకు గడచిన నాలుగేళ్లలో చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లింకు కూడా తన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సబ్ కా వికాస్ అని ఎలా నినదిస్తారని సూటిగా అడిగారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ముస్లిం మైనారిటీల కోసం ఎక్కువ నిధులు కేటాయించిందని, దాని ఫలితంగా నేడు వేల మంది ముస్లిం విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు తమ స్వార్థ రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల మద్దతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అరవై ఏళ్లుగా ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ వచ్చినా ప్రయోజనం జరగలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవధ పేరిట ముస్లింలను హింసిస్తున్నారని అన్నారు. చట్ట సభల్లో, ఉద్యోగాల్లో ముస్లిం జనాభా దామాషాలో ప్రాతినిధ్యం లేదని వివరించారు. -
‘కాంగ్రెస్ బడా నాయకులకు జైలు, బెయిలు’
జైపూర్: దేశంలోని కాంగ్రెస్ బడా నాయకులంతా కేసుల్లో ఇరుక్కొని బెయిలుపై బయట తిరుగుతున్నారనీ.. కాంగ్రెస్ పార్టీ ‘బెయిల్ గాడీ’ (బెయిల్ బండి) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాగా, భార్య సునందా పుష్కర్ హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ ఆరోపణలు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే. ఆయా కేసుల్లో వీరిద్దరూ ఇటీవలే బెయిలు పొందారు. కొన్ని నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం జరిగిన బహిరంగ సభ.. ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. దాదాపు 2.5 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నారనీ.. 12 సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభ నిండిపోయిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలోని 1500 గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తామని హామీనిచ్చారు. వసుంధరా రాజే నాయకత్వంతో రాష్ట్రం గొప్ప అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మరోవైపు సభకు హాజరైనవారంతా బీజేపీ కార్యకర్తలేనని.. అందులో లబ్ధిదారులు లేరని కాంగ్రెస్ విమర్శించింది. -
పది నుంచి రైతు రక్షణ జాతా ప్రారంభం
విజయవాడ(గాంధీనగర్) : అప్పులో ఊబిలో కూరుకుపోయిన రైతులను, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ‘రైతు రక్షణ జాతాలు’ నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో రైతు రక్షణ జాతా వాల్‌పోస్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 10న శ్రీకాకుళం జిల్లా పలాస, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రక్షణ జాతాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ముగింపు సందర్భంగా 20వ తేదీ విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ నిర్వహించనున్నట్లు వివరించారు.ఽ వ్యవసాయరంగంపై పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 271 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు రామచంద్రయ్య, సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌బాబు, కృష్ణాజిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
నేడు ‘పేట’లో బహిరంగ సభ
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : జీఓ 69 ప్రకారం భీమా ఫేజ్–1 ద్వారా నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల చేపట్టాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు నారాయణపేట పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. ముఖ్య అతిథులుగా గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లాకొత్వాల్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, బీజేపీ శాసనసభ ఉపనాయకుడు ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు కె.రమా, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హన్మేష్ హాజరవుతారన్నారు. -
రేపు కాకినాడలో వైఎస్ఆర్సీపీ యువభేరీ, బహిరంగ సభ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్సీపీ యువభేరీ కార్యక్రమం, బహిరంగ సభ రేపు(బుధవారం) తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ అంబేడ్కర్ భవన్లో ఏపీకి ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువతతో వైఎస్ ముఖాముఖి నిర్వహించనున్నారు. యువభేరీ కార్యక్రమం అనంతరం కాకినాడలో జేఎన్టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వైఎస్ జగన్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. కాగా, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేరనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 21న కాకినాడలో యువభేరీ కార్యక్రమం జరగాల్సి ఉండగా, అందులో స్వల్ప మార్పుతో ఈ కార్యక్రమాన్ని 27న నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత వారం ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.