న్యూఢిల్లీ : తమ డిమాండ్లను అంగీకరించేవరకు లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంటిని వీడేదిలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ మంత్రులు బీష్మీంచుకొని కూర్చున్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలనే మూడు ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్ అండ్ కో రాత్రంతా లెఫ్టనెంట్ గవర్నర్ ఇంట్లో ఉండి నిరసన తెలిపారు.
నాలుగు నెలలుగా పలు దఫాలుగా ఎల్జీని కలిసి విన్నవించినా తమ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, నిరసనగా రాజ్‌నివాస్‌లోని వెయిటింగ్ రూంలో బైఠాయించినట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్, గోపాల్‌రాయ్‌లున్నారు. వీరంతా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మరి అక్కడే భోజనం చేశారని, డయాబెటిక్ పేషంట్ అయిన కేజ్రీవాల్ ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా అక్కడే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్ కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంలో పోలీసులు రాజ్‌నివాస్ వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి కారణం లేకుండానే కేజ్రీవాల్ అకస్మాత్తుగా నిరసనకు దిగారని, విధులకు గైర్హాజరై ఆందోళనలు చేస్తున్న అధికారులకు సమన్లు జారీచేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి బెదిరింపులు దిగారని ఎల్‌జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఏఎస్ అధికారులు సమ్మే చేస్తున్నారన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలను ఐఏఎస్‌ల సంఘం ఖండించింది. ఇవి పూర్తి నిరాదారమైన, అసంబద్దమైన ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment