
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న వ్యక్తి ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాట దీక్షలు చేయడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవడంతో ఒక్కసారిగా టీడీపీకి గుబులు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని ఆవిధంగా తెలంగాణ ఎంపీలు కలిసిరావలని కేటీఆర్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై చర్చించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని సత్యనారయాణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం నిర్మాణంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి ఏది అవసరం అనుకుంటే అది చరిత్రాత్మాక అవసరమంటారని విమర్శించారు. జన్మభూమి కమిటీలు రాజ్యేంగేతర శక్తులుగా మారి ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గ్రామ స్థాయి నుంచి విశ్వాసం కోల్పోయిందని గత ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600 హామీలలో ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో దోపిడి డబ్బులతో రాజకీయం చేయాలని చంద్రబాబు అండ్ కొ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment