
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాపాత్ముని పాలన అంతమైందని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో అసెంబ్లీ రద్దుపై ఆయన మాట్లాడారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారమిస్తే.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందన్నారు.
కేసీఆర్ ఓ ఆధునిక నయీం అని, అతని ఎన్‌కౌంటర్ తర్వాత దొరికిన డైరీ, ఆస్తులు ఎటుపోయాయని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు మూసేస్తామని చెప్పి.. పబ్బులను కేటీఆర్ తెరిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక, గుట్కా దందాలతో దోచుకుంటున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు.