సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లలో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుండగా, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకబడింది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్‌ఎన్‌ఎస్) ఘోరంగా చతికిలపడింది. 110 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఈ పార్టీ కేవలం ఒకచోట గెలిచింది. ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. తన మాటలతో జనాన్ని ఆకర్షించే నాయకుడిగా పేరుపొందిన 51 ఏళ్ల రాజ్ థాకర్ తన పార్టీని మాత్రం గెలుపుబాట పట్టించలేకపోయారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్ 13 సీట్లు గెలిచింది. 2014లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్ పోటీ చేయకపోయినప్పటికీ, బీజేపీ వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే ప్రచారం నిర్వహించారు. అప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 42 చోట్ల గెలిచి సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై విరుచుకుపడ్డారు. కేంద్రం ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించేంత వరకు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని కాంగ్రెస్, ఎన్సీపీలను కోరారు. శరద్ పవార్‌తో పాటు కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో రాజ్ ఠాక్రే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్)
Comments
Please login to add a commentAdd a comment