సాక్షి, సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆరుగురు అధికారులతో కమిటీ వేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన కేసీఆర్, మంత్రి ఈటలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఉన్న స్వేచ్చ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉండదు. ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూనే ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తుందని, చెడు చేస్తే ప్రశ్నింస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ న్యాయపరమైది కాబట్టే ప్రగతి భవన్ ముట్టడి,సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నాను. కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. కేశవరావు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పులిలాగా ఉండేవారని, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత పిల్లిలాగా మారిపోయారని ఎద్దేవా చేశారు. డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గౌరవప్రదమైన స్థానం ఉండేదని, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాక కనుమరుగయ్యారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment