
సాక్షి, గుంటూరు : ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు... తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎక్కడ ఏం జరిగినా అది ప్రతిపక్షానికి అంటగట్టడం టీడీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఇళ్ల పట్టాల గురించి మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేష్‌ను నిలదీసిన ఓటర్లుకు అలాంటి అనుభవమే ఎదురైంది. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ నేతలను తన్నాలంటూ బూతులు మాట్లాడటం గమనార్హం. వివరాల్లోకి వెళితే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మానందపురంలో లోకేష్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను తమకు ఇళ్ల పట్టాలు మంజూరు కాలేదంటూ నిలదీశారు. దీంతో ఏమి చెప్పాలో అర్థం కాని ’మందలగిరి’ మాలోకం...ప్రతపక్షంపై విరుచుకుపడ్డారు.
‘నాకు ఇంకా ఓపిక నశించింది. ప్రతిపక్షం ఉన్నదే ప్రభుత్వంపై బుదర చల్లడానికి. ప్రతిపక్షం బురదచల్లి పారిపోతే.. వాటిని నేను తుడుచుకుంటూ కూర్చోవాలా? ఏం పనిలేదా నాకు?. అందుకే వాళ్లను తన్నమంటున్నాను కదా. పోలీసు సోదరులకు కూడా నేను చెబుతున్నా. తంతే మీ జోలికి రారు. ఆ నా కొడుకులను తన్నాలి. లేకపోతే ఆ నా కొడుకులు ఇక్కడకు వచ్చి పుకార్లు లేపుతారు. వారి ఇంకే పని లేదా? అంటూ నోరు పారేసుకున్నారు. ఆ వీడియో మీరు చూడండి...
Comments
Please login to add a commentAdd a comment