
తాడేపల్లిలోని సీతానగరం వద్ద నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న వాహనాలు
సాక్షి, మంగళగిరి : మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. టీడీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేష్ బుధవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. సీతానగరంలో ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారా? పేదలకు ఇళ్లు ఎక్కడ కట్టించారు? అసలు ఒక్క ఇల్లు అయినా కట్టారా? ఏం సమస్యలు పరిష్కరించారని మీకు ఓటు వేయాలి? అని నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన లోకేష్.. కాసేపు మాట్లాడిందే మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నారా లోకేష్‌ను నిలదీస్తున్న ప్రజలు