కాకినాడ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన సహజ ధోరణితో అభాసుపాలయ్యారు. నాలుగేళ్లలో పలుమార్లు తన ప్రసంగాలతో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో తెలుగు భాషకు తెగులు పట్టించారు. తెలుగును సరిగ్గా ఉచ్ఛరించలేక పలుమార్లు అర్థ రహితంగా మాట్లాడారు. దీంతో సభలో ఉన్న మహిళలు లోకేష్ ప్రసంగిస్తుండగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
లోకేష్ ప్రసంగం సాగిందిలా..
‘కాకినాడ నగరం, కాకినాడ కాజా, కాకినాడ బీచ్ గుర్తొస్తే సొచ్చనంగా(స్వచ్చంగా అని చెప్పబోయి) ఉంటాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్‌పై మన ముఖ్యమంత్రి గారు 29 సాలు జెల్లీ(29 సార్లు ఢిల్లీ అని చెప్పడానికి) చుట్టూ తిరిగారు. ఇంకొకపక్క చంద్రన్న బీమా ప్రమాదపు శాతం(ప్రమాదవ శాత్తు అని చెప్పే ప్రయత్నంలో) ఎవరైనా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంటున్నాం. సహజన మరణవ్‌తే(సహజంగా మరణిస్తే అని చెప్పడానికి తిప్పలు పడుతూ) రెండు లక్షలు ఇస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ జోదెద్దుల(జోడెద్దులు అని చెప్పేందుకు మల్లగుల్లాలు) బండి. ఎప్పుడైతే మనం ఇండియా(ఎన్డీయే అనే పదాన్ని చెప్పేందుకు) నుంచి బయటకు వచ్చామో బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ పెట్టారు. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడే మన ముఖ్యమంత్రి గారిని అభినిందిచాల్సిన (అభినందిచాలని చెప్పేందుకు కష్టపడుతూ) అవసరం చాలా చాలా ఉంది. వయో భారం ఆయనపై ఎప్పుడూ కంపడదు(కనపడదు అని చెప్పడానికి).’ అని లోకేష్ సభలో వ్యాఖ్యానించారు.
కాగా, కాకినాడ సభలో లోకేష్ మాట్లాడిన కొత్త భాష పేరేంటో చెప్పాలని నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. మరి మీరు కూడా మంత్రిగారికి తెలుగు భాషలో ఉన్న ప్రావీణ్యాన్ని చూసేయండి.
లోకేశ్ గత వ్యాఖ్యల కోసం.. కింది లింక్స్‌పై క్లిక్ చేయండి..
టీడీపీ నుంచి పీవీ ప్రధాని అయ్యారు: లోకేశ్
మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేశ్..
Comments
Please login to add a commentAdd a comment