
సాక్షి,బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ప్రధాన పార్టీల నేతలు పూజలు నిర్వహించారు. షికారిపుర నుంచి పోటీలో నిలిచిన బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప మంగళవారం ఉదయం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఇక బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్ధరామయ్యపై పోటీ చేసిన బీజేపీ నేత బి శ్రీరాములు పార్టీ విజయాన్ని కోరుతూ మంగళవారం ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ నగమగాలలోని ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో పూజలు నిర్వహించారు.
కుమారస్వామి రామనగర, చెన్నపట్న నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. కాగా కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీపై కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment