జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రెండు రోజుల పర్యటనకు జిల్లాకు వచ్చారు. బుధవారం సాయంత్రం కడపలో రోడ్‌షో నిర్వహించి అన్నమయ్య సర్కిల్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. వామపక్షాలతో తప్ప ఇతర పార్టీలతో కలిసేదిలేదని ఆయన స్పష్టం చేశారు
సాక్షి కడప : రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అధికార పార్టీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన కడపలో రోడ్‌షో నిర్వహించారు. అన్నమయ్య సర్కిల్ వద్ద బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ రాయలసీమ వెనుకకు నెట్టబడిన ప్రాంతమన్నారు. ఓట్ల కోసం తాను రాలేదన్నారు. మనో ధైర్యాన్ని నింపేందుకే సీమ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు. రాయలసీమకు వివక్ష లేని స్వేచ్ఛ కావాలన్నారు. . ‘సీమ’లో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని అంతమొందించడం జనసేన లక్ష్యమన్నారు.
భయం లేదు....ప్రాణ భీతి లేదు....ప్రత్యర్థులు బాంబులు వేసినా భయపడే మనస్తత్వం తనది కాదన్నారు., వాటిని పట్టుకునే సామర్థ్యం.. ధైర్యంగా ముందుకు వెళ్లే యువతే కావాలన్నారు. ప్రజలకు తాయిలాలు ఇచ్చి వంచన చేసేందుకు రాలేదన్నారు.
చంద్రబాబు సీఎం సీటులో తన కుమారుడిని కూర్చొబెట్టడానికి ప్రయత్నిస్తున్నడని పవన్ ఆరోపించారు. తాను కొన్నేళ్లపాటు ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటానని వివరించారు. రాయలసీమ కొన్ని కుటుంబాల ఆధిపత్యంతో నలిగిపోతోందన్నారు. జన సైనికులు గాయపడిన, దెబ్బతిన్న బొబ్బిలిలా ముందుకు పోతారని వివరించారు. కులాలను విడదీసి రాజకీయం చేయను... కులాలను కలిపే రాజకీయం చేస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం సన్నిహితుడైన ప్రధానితో కూడా గొడవపడ్డానని వివరించారు. పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటివి చేయడమే జనసేన లక్ష్యమన్నారు. మార్చిలో జనసేన మ్యానిఫెస్టో ప్రకటించనున్నట్లు తెలిపారు.
యువరక్తం గల వారినే నేతలుగా తీర్చిదిద్దుతానని వివరించారు. అన్నయ్య పార్టీని పెట్టినపుడు కూడా కొందరు ఓపికగా ఉండలేకపోయారని, అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేశారని వివరించారు. రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ప్రభుత్వాలు మారాలి.. ప్రజలకు మెరుగైన పాలన అందిచాలి....ప్రజల్లో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా మార్పు కోసమే ముందుకు సాగుతున్నానని వివరించారు బహిరంగసభ అనంతరం పవన్ కల్యాణ్ కడప పెద్దదర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకుడు సుంకర శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment