‘ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారు’ | Perni Nani Fires On Chandrababu Over Babu Amaravati Visit | Sakshi
Sakshi News home page

నేలకు ముద్దుపెట్టి డ్రామాలడుతున్నాడు: పేర్ని నాని

Nov 28 2019 4:03 PM | Updated on Nov 28 2019 4:36 PM

Perni Nani Fires On Chandrababu Over Babu Amaravati Visit - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో సమస్య సృష్టించాలని చూస్తున్నాడని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఋషులు యజ్ఞం చేస్తూంటే రాక్షసులు అడ్డుపడినట్లు బాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస​ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశాంతంగా సంక్షేమ పాలన చేస్తుంటే చంద్రబాబు అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి పర్యటనలో నేలకు ముద్దుపెట్టి డ్రామాలడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు కనీసం సచివాలయంలో టాయిలెట్లు కూడా కట్టించలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు గ్రాఫిక్‌, రాజమౌళి బొమ్మలతో డ్రామాలడారని.. రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులను మోసం చేసి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement