గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉన్నా.. | Ponnam Prabhakar Always With People | Sakshi
Sakshi News home page

గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉన్నా..

Published Tue, Apr 2 2019 3:39 PM | Last Updated on Tue, Apr 2 2019 3:41 PM

Ponnam Prabhakar Always With People - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

సాక్షి, సిరిసిల్లటౌన్‌: ‘ఎంపీగా గెల్చినప్పుడు ప్రజల్లో ఉ న్న.. ఓడినా వారివెంటే ఉన్న.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం విరామం లేకుండా పోరాడిన’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారన్నారు. రాబోయే పా ర్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చూపిస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన సాగుతున్నా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల ఊసేలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రిగా రూ.12వేల లోపు ఆదాయం ఉన్న కు టుంబాలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక భరోసా కల్పిస్తారని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ఆటుపోట్లకు గురైనప్పుడు అప్పటి కాంగ్రెస్‌ స ర్కారు చేయూత నిచ్చిందని గుర్తు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌ చొరవతోనే రూ.32 కోట్లతో దిగువ మానేరుకు నీరు అందిస్తున్నారని తెలిపా రు. కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ, సీపీఐ మద్దతు ప్రకటించాయి. డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారా యణగౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, నాయకులు సంగీతం శ్రీనివాస్, గుడ్ల మంజుల, వెల్ముల స్వరూప, సూర దేవరాజు, గుంటి వేణు, సామల మల్లేశం, బూర శ్రీనివాస్, రిక్కుమల్ల మనోజ్, మొహినొద్దీన్‌ పాల్గొన్నారు. 

గెలుపు దీక్ష తీసుకోండి..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ‘కాంగ్రెస్‌ గెలుపు దీక్ష’ తీసుకో వాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్ర భాకర్‌ కోరారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంకోసం ప్రాణా లు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీతో పోలిస్తే ప్రధాని మోదీ చేసిందేమీలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, నాగుల సత్యనారాయణ, మడుపు శ్రీధేవి, సంగీతం శ్రీనివాస్, జాల్గం ప్రవీణ్‌కుమార్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ గెలుపుతో దేశానికి లాభం
ముస్తాబాద్‌(సిరిసిల్ల): స్థానికులకు స్థానికేతరులకు జరుగుతున్న ఎన్నికలు ఇవని.. కాంగ్రెస్‌ గెలుపుతో దేశానికి లాభం జరుగుతుందని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మండల కేంద్రంలో జరిగిన ప్రచార ర్యాలీతోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమన్నారు. నాయకులు నాగుల సత్యనారాయణ,  కేకే మహేందర్‌రెడ్డి, బుర్ర రాములు, గజ్జెల రాజు, మిర్యాల్‌కార్‌ శ్రీనివాస్, యెల్ల బాల్‌రెడ్డి, ఎల్లాగౌడ్, రాజేశం, జహంగీర్, దీటి నర్సింలు, రమేశ్, సావిత్రి, మహేశ్‌రెడ్డి, ఉపేంద్ర, మంత్రిరాజం, కొండం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

16 మంది ఎంపీలతో ప్రధాని అవుతారా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): 16 మంది ఎంపీలతో సీఎం కేసీఆర్‌ ప్రధాని ఎలా అవుతారనిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈఎన్నికల్లో స్థానికేతరుడైన వినోద్‌కుమార్‌ను ఇంటికి పంపడం ఖాయమ పేర్కొన్నారు. వినోద్‌కుమార్‌ వీర్నపల్లిని దత్తత తీసుకొని ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, నాగుల సత్యనారాయణగౌడ్, ఎస్‌కే గౌస్, బుగ్గ కృష్ణమూర్తి, సద్ది లక్ష్మారెడ్డి, బూత శ్రీనివాస్, బుచ్చయ్యగౌడ్, దండు శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, కరికె శ్రీనివాస్, సాహేబ్, గుర్రపు రాములు, రాములుగౌడ్, దేవచంద్రం, కార్యకర్తలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement