మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మంగళవారం ఉదయం నుంచీ చోటు చేసుకున్న అనూహ్య మార్పుల క్రమమిదీ...
- ఉదయం 10.39: ఫడ్నవీస్ బలపరీక్షకు బుధవారం సాయంత్రం వరకు గడువునిచ్చిన సుప్రీంకోర్టు.
- 11.32: మహారాష్ట్ర పరిణామాలకు నిరసనగా రాజ్యాంగ దినోత్సవ పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్; శివసేన ప్రతిపక్షాలు
- 12.07: సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేస్తున్నారనీ, 162 మంది మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారంటూ శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్య
- 12.18: అసెంబ్లీలో బలనిరూపణ పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన కాంగ్రెస్ చీఫ్ సోనియా
- 01.18: పార్టీ ఎమ్మెల్యేలందరూ ముంబై రావాలని బీజేపీ పిలుపు.
- 03.01: బుధవారం బలనిరూపణకి సుప్రీంకోర్టు సమయాన్నిచ్చిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డాతో ప్రధాని మోదీ భేటీ
- 03.16: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సమావేశం అనంతరం మరో ఐదేళ్ల పాటు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అంటూ శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటన.
- 03.18: అజిత్ పవార్ తమతోనే ఉన్నాడన్న సంజయ్ రౌత్
- 03.42: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా
- 04.34: గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన ఫడ్నవీస్
- 05.06: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కోలంబ్కర్ నియామకం
- 05.50: కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ప్రకటన
- 06.07: ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిం చాలని గవర్నర్‌ని కోరిన కాంగ్రెస్
- 7.47: ఓడిన, అవకాశవాద పార్టీల కూటమి ప్రజల మద్దతు పొందదన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు
- 9.12: ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్రను ప్రశ్నించిన వామపక్షాలు.
- 9.39: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి చేరుకున్న అజిత్ పవార్
- 9.39: రాజ్‌భవన్‌కు చేరుకున్న ఉద్ధవ్
- 9.46: ముంబైలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం
ఎప్పుడేం జరిగిందంటే..
Published Wed, Nov 27 2019 2:58 AM | Last Updated on Wed, Nov 27 2019 3:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment