రాఫెల్‌ డీల్‌పై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు | Sharad Pawar Supports Narendra Modi On Rafale Deal | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 27 2018 4:12 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

Sharad Pawar Supports Narendra Modi On Rafale Deal - Sakshi

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాలన్నీ బీజేపీపై ఎదురుదాడికి దిగితే.. ఎన్సీపీ అధినేత శరద పవార్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన పవార్‌ ఓ మరాఠి న్యూస్‌ చానల్‌తో మాట్లాడుతూ.. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యవహరించిన తీరు మాత్రం ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉందని తెలిపారు. అందుకే కేంద్రం ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రభుత్వం తరఫున స్పందించే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈ ఒప్పందం ద్వారా మోదీ నేతృత్వంలోని బీజేపీ భారీగా అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పవార్‌ మోదీని సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు కాకుండా.. ఇతర సంస్థలను(తమకు అనుకూలమైన) ఈ ఒప్పందంలో భాగస్వాములుగా చేర్చడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడటమే కాకుండా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement