
సాక్షి, చెన్నై : మన నేతల టాలెంట్ మరోసారి పబ్లిక్‌గా బయటపడింది. తమిళనాడుకు చెందిన ఓ మంత్రి నోరు జారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.
ఇండియాటుడే ప్రచురించిన కథనం ప్రకారం... అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ ఈ మధ్య దిండిగల్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరయ్యాడు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... రాష్ట్ర అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి వచ్చాడని చెప్పారు. ఇంకేం శ్రీనివాసన్‌ను తమకు కావాల్సిన రీతిలో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.
అక్టోబర్ 12న పన్నీర్ సెల్వం కొంత మంది సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో రాజకీయ అంశాలేవీ చర్చకు రాలేదని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, డెంగీ విజృంభణ-నివారణ చర్యల గురించి మాత్రమే చర్చించామని ఓపీఎస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment