సాక్షి, అనంతపురం: పోలవరం యాత్ర పేరుతో టీడీపీ నేతలు చేసిన జల్సాలు వెలుగులోకి వచ్చాయి. రైతుల ముసుగులో పోలవరం యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతల మద్యం తాగి చిందేశారు. వివరాల్లోకి వెళితే.. రైతుల పేరుతో ఏర్పాటు చేసిన 25 ఆర్టీసీ బస్సుల్లో 1300 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలవరం యాత్రకు వెళ్లారు. పెనుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది.
అయితే.. బస్సులో మద్యం తాగిన నేతలు.. చిందేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో టీడీపీ నేతల బాగోతం బయటపడింది. పోలవరం యాత్ర పేరుతో టీడీపీ నేతలు చేసిన నిర్వాకంపై రైతులు మండిపడుతున్నారు. పోలవరం యాత్రకు రైతులను తీసుకెళ్తున్నామని పైకి చెబుతూ.. అధికార పార్టీ నేతలు సాగిస్తున్న జల్సాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment