(కుడి వైపు) రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై ఎన్నికై.. స్వార్థ ప్రయోజనాల కోసం ‘పచ్చ’కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి అసమ్మతి సెగ తగిలింది. ఆమెపై టీడీపీ పాతకాపులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. స్వప్రయోజనాలతో ఆమె పార్టీ మారినా వైఎస్సార్ సీపీ కేడర్ టీడీపీలోకి వెళ్లలేదు. ఒకరిద్దరితో మాత్రమే ఆమె ‘పచ్చ’ కండువా వేసుకున్న దుస్థితి నాడు చోటు చేసుకుంది. టీడీపీలో వెళ్లిన తరువాత ఆమె అక్కడ పూర్వం నుంచీ పని చేస్తున్న నాయకులను కలుపుకోలేకపోయారు. దీంతో ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆమె చేసిందేమీ లేదం టూ ఆ పార్టీ సీనియర్లు ఆమెను వ్యతిరేకిస్తున్నారు.
దీనిపై అధిష్టానానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. అమరావతిలోని సీఎం నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. వంతలకు టిక్కెట్టు ఇవ్వద్దని చంద్రబాబు ఎదుటే ఆందోళనకు దిగారు. తమ మాట కాదని వంతలకు టిక్కెట్టు ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు. ఆమెకు వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా.. ఒకరిద్దరిని ఇండిపెండెంట్లుగా పోటీకి దింపి దెబ్బ కొడతామని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. పెళ్లినాటి మాటలు విడాకుల రోజున ఉండవన్నట్టు.. తిరిగి టిక్కెట్టు ఇచ్చే విషయమై ఆమె పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ ని ఎన్నికల వేళ అమలు చేసే విషయంలో అధినేత ఊగి సలాటలో పడ్డారు.
టీడీపీ పాతకాపులు తీవ్రస్థాయిలో అసమ్మతి రాగం ఆలపిస్తుండడంతో రాజేశ్వరికి టిక్కెట్టు ఖరారు చేసే విషయమై చంద్రబాబు ఇరకాటంలో పడ్డా రు. ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వద్దంటూ సీఎం నివా సం ముందు ఆందోళన చేసినవారిలో టీడీపీ రంపచోడవరం అధ్యక్షుడు అడబాల బాపిరాజు, గంగవరం అధ్యక్షుడు పాము అర్జున్, మారేడుమిల్లి అధ్యక్షుడు సూరిబాబు గౌడ్, విలీన మండలాల నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment