
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. ఈ రోజు 4.11 గంటలకు కొత్త మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఇప్పటికే పలువురు మంత్రులు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కలిసి ఒకే కారులో రాజ్‌భవన్‌కు వెళ్లారు.
కొత్త మంత్రులు వీరే
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. తొలిసారిగా కేసీఆర్ కేబినేట్ ఇద్దరు మహిళలకు చోటు దక్కింది.