
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ లేదంటున్న వారు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎలా ఓడిపోయారో తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి వాఖ్యానించారు. బుధవారం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని అనడం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని అన్నారు.