
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వలస కార్మికులను అవమానీయంగా చూశారన్నారు. ఉపాధి హామీ పని 200 రోజులకు పెంచాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వలస కార్మికులను తరలించేంతవరకు ప్రభుత్వమే వసతి కల్పించాలని ఉత్తమ్ అన్నారు. కేంద్రానికి కనువిప్పు కలిగేలా అతిపెద్ద ఆన్‌లైన్ క్యాంపైన్ చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 1500 మంది ఈ సోషల్ మీడియా క్యాంపైన్‌లో పాల్గొనాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment