వైఎస్సార్‌ సీపీ నేతల కీలక భేటీ | YSR Congress Leaders Meeting | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతల కీలక భేటీ

Oct 26 2018 6:05 PM | Updated on Oct 26 2018 8:28 PM

YSR Congress Leaders Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని జరుగుతున్న సమావేశానికి అందుబాటులో ఉన్న నాయకులు హాజరయ్యారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్‌జగన్‌పై హత్యాయత్నం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించిన తీరు తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు.

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కె. పార్థసారధి, వరప్రసాద్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, పార్థసారధి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement