సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 13 జిల్లాలలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని, రాబోయే ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓటమి భయంతో నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని నాటకం ఆడారని ఆరోపించారు. రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాడని, 13జిల్లాలలో డిపాజిట్లు రావన్న ఓటమి భయంతో ఎన్నికలను వాయిదా వేయించాడని అన్నారు. వైద్యఆరోగ్య శాఖను సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఎన్నికలను అడ్డుకున్నారని, ప్రజల కోసం కాకుండా ఎన్నికల కమిషన్ చంద్రబాబు కోసం ఎన్నికలను వాయిదా వేసిందని మండిపడ్డారు. ప్రజల బాధ్యత తీసుకున్న ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వలేదని అన్నారు. ( బెదిరించ లేదు, ఇది వాస్తవం: అంబటి )
‘2018లో జరగాల్సిన ఎన్నికలను ఓటమి భయంతో వాయిదా వేశారు. ధైర్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు వెళ్తే.. కోర్టుల ద్వారా, ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా కక్ష తీర్చుకుంటున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు. డబ్బు, మద్యం అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ఓర్వలేక పోతున్నార’ని అన్నారు. ( చంద్రబాబు మీకేమైనా నివేదిక ఇచ్చారా? )
Comments
Please login to add a commentAdd a comment