
సాక్షి, అమరావతి: ప్రజల సానుభూతి కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన నాటకం ఆడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై చెప్పులు, గుడ్లు విసిరింది టీడీపీ పెయిడ్ బ్యాచ్ అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిని కోరుకుంటున్నారని, ఇక ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు విశాఖ రాజధానికి వ్యతిరేకమని ప్రకటించగలరా అని సవాలు విసిరారు. రాష్ట్రానికి బాబు శనిలా దాపురించారని, అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.