మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే ఐజయ్య, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నందికొట్కూరు (కర్నూలు): బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వారి పట్ల చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని షికారిపేటలో ఇటీవల గొంతువాపు వ్యాధితో మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులను ఆదివారం వారు పరామర్శించారు. మృతుల కుంటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కొక్కరికి రూ.7వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. వారు మాట్లాడుతూ.. గొంతువాపు వ్యాధితో ప్రసాద్, చంద్రవతి దంపతుల కుమారుడు పరమేశ్వర్, దిబ్బన్న, రాజమ్మ దంపతుల కుమారుడు నరసింహులు మృతి చెందినా అధికార పార్టీ నాయకులు, పాలకులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
టీడీపీ ప్రభుత్వానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన కాలనీలు పట్టావా అని నిలదీశారు. పేదలకు టీకాలపై, ఆరోగ్యం అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చిన్నారులకు పుట్టిన వెంటనే టీకాలు వేసి ఉం టే నిండు నూరేళ్లు బతికేవారని అభిప్రాయపడ్డారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కోకిల రమణారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాయకులు రవికుమార్, ధర్మారెడ్డి, ఉపేంద్రా ర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, కాంతారెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు అచ్చన్న, నగేష్, వెంక టేష్, జమీల్, జనార్దన్, ఉస్మాన్‌బేగ్, అబ్దుల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment