MLA ijayya
-
పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్ ఫ్రంట్
-
‘హీరోలు కలిసినప్పుడు.. జగన్ కలిస్తే తప్పేంటి’
సాక్షి, కర్నూల్ : ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే టీడీపీ నాయకులు ఎందుకు ఉల్కిపడుతున్నారంటూ నందికోట్కూర్ ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మళ్లీ టీడీపీతో జతకడుతున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్ ఫ్రంట్ : కాటసాని తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని, కేటీఆర్ కలిస్తే తప్పేంటని వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాం భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్ ఫ్రంట్‌తో జతకడుతున్నామని తెలిపారు. సినిమాల కోసం బాలకృష్ట, పవన్ కళ్యాణ్‌లు కేసీఆర్‌ను కలిస్తే తప్పు లేనప్పుడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్, కేటీఆర్‌ను కలిస్తే మాత్రం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. -
బడుగు, బలహీన వర్గాలపై ప్రభుత్వం చిన్నచూపు
నందికొట్కూరు (కర్నూలు): బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వారి పట్ల చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని షికారిపేటలో ఇటీవల గొంతువాపు వ్యాధితో మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులను ఆదివారం వారు పరామర్శించారు. మృతుల కుంటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఒక్కొక్కరికి రూ.7వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. వారు మాట్లాడుతూ.. గొంతువాపు వ్యాధితో ప్రసాద్, చంద్రవతి దంపతుల కుమారుడు పరమేశ్వర్, దిబ్బన్న, రాజమ్మ దంపతుల కుమారుడు నరసింహులు మృతి చెందినా అధికార పార్టీ నాయకులు, పాలకులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన కాలనీలు పట్టావా అని నిలదీశారు. పేదలకు టీకాలపై, ఆరోగ్యం అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చిన్నారులకు పుట్టిన వెంటనే టీకాలు వేసి ఉం టే నిండు నూరేళ్లు బతికేవారని అభిప్రాయపడ్డారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కోకిల రమణారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాయకులు రవికుమార్, ధర్మారెడ్డి, ఉపేంద్రా ర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, కాంతారెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు అచ్చన్న, నగేష్, వెంక టేష్, జమీల్, జనార్దన్, ఉస్మాన్‌బేగ్, అబ్దుల్లా పాల్గొన్నారు. -
భవిష్యత్ మనదే
పాములపాడు: ‘ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు విసిగి చెందారు. ఓటుతో గుణపాఠం చెప్పేందుకే సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్ వైఎస్ఆర్సీపీదే. కలసికట్టుగా పని చేద్దాం’.. అంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పాములపాడులో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు చౌడయ్య అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం భారీగా డబ్బు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, అయితే ఎన్నికలు రాక ముందే టీడీపీలో సీట్ల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కంటే నియోజకవర్గాల పెంపు పైనే సీఎం ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. నయీంతో సంబంధాలున్న శివానందరెడ్డితో తాను పోటీపడలేనని ఎద్దేవా చేశారు. దళిత నియోజకవర్గమైన నందికొట్కూరులో రెడ్లకు పెత్తనం ఇచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై ఆనాడు చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నించారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చూసుకోవాలన్నది అందరి లక్ష్యమని, అందుకోసం సైనికుల్లా పని చేద్దామంటూ పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిరంతరం పాటు పడే కార్యకర్తలకు అండగా ఉంటానని, వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలో త్వరలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోము వీర్రాజు ప్రశ్నలకు సమాధానం ఏదీ? చంద్రబాబు నాయుడు రెండెకరాల ఆస్తి నుంచి రూ. 2 లక్షల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు సీఎం నుంచి సమాధానం ఎందుకు రాలేదని ప్రశ్ని ంచారు. కేంద్రం నిధుల్లో లెక్కలు ఎందుకు చూపడంలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగస్వామి, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బంగా రు మౌలాలి, ఓబన్న, బాలసుబ్బారెడ్డి, అంబన్న, అంబయ్య, ధర్మారాజు, మహేశ్వరరావు, రామస్వామి, రాజన్న, శ్రీనువాసులు, శేఖర్, సుధాకరరెడ్డి, ప్రభాకర్, దరగయ్య పాల్గొన్నారు. -
నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎందే
నందికొట్కూరు: బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు హామీ ఇచ్చి నట్టేట ముంచేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే ఐజయ్య ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయని తూతూ మంత్రంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యావంతులు బాబు జిమ్మిక్కులను ఇక నమ్మరన్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సైతం తొలగించిన చరిత్ర చంద్రబాబుదేనని తెలుసుకున్నారన్నారు. ఈమేళాకు హాజరైన నిరుద్యోగులందరికీ వారి విద్యా అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నరసింహులు, బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల డైరెక్టర్లు రమే‹ష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జాన్ ఎలీషాబాబు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నన్ను అవమానించారు
దళిత ఎమ్మెల్యే ఐజయ్య ఆవేదన సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు దళిత ఎమ్మెల్యేనైన తనను దారుణంగా అవమానించారని, అయినా సరే తన నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని అవమానాలనైనా భరిస్తానని నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యక్కలదేవి ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరులో జరిగిన సమావేశంలో మాట్లాడనీయకుండా తన మైక్‌ను బాబు ఉద్దేశ్యపూర్వకంగా కట్ చేయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జునతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశంలో తాను, రాయలసీమ రైతులను కూడా భాగస్వాములను చేస్తూ జాయింట్ వెంచర్ పెట్టవచ్చు కదా అని సీఎంను అడిగానని, అవన్నీ మీకు చెప్పనక్కర లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి నిరోధకులు అంటూ తనపై చంద్రబాబు మండిపడ్డారన్నారు. జైన్ ఇరిగేషన్ సంస్థ వల్ల ప్రజలకేమీ లాభం లేదని, కేవలం ఆ యాజమాన్యానికే లాభాలు వస్తాయని ఐజయ్య వివరించారు. -
చంద్రబాబు వర్సెస్ ఐజయ్య
- జైన్ ఇరిగేషన్‌కు భూ కేటాయింపులపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య - భూములను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని అడగటంపై సీఎం ఆగ్రహం సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రప్రభుత్వం యథేచ్ఛగా చేస్తున్న భూ కేటాయింపులపై ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. విపక్ష ఎమ్మెల్యేల గళాలను నులిమే యత్నం చేస్తోంది! సర్కారు భూ పందారానికి అడ్డుపడ్డ నందికొట్కూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్యపై కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిండు సభలో ప్రజల సాక్షిగా దళిత ఎమ్మెల్యే ఐజయ్యను చంద్రబాబు అవమానించారు. అభివృద్ధిపై ఎమ్మెల్యేకూ సమాచారం ఇవ్వరట నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచ వద్ద జైన్ ఇరిగేషన్ ఫుడ్‌పార్కుకు సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. అయితే జైన్ ఇరిగేషన్‌కు అప్పగించిన భూముల్లో ఏం చేయబోతున్నారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్ చేశారు. జైన్ ఇరిగేషన్ సంస్థలకు ప్రభుత్వం ఎంత భూమి కేటాయించిందో తనకే తెలియదని, ఇక ప్రజలకు ఏంతెలుస్తుందని అనటంపై సీఎం ఆగ్రహించారు. దీంతో చంద్ర బాబు ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే నియోజకవర్గంలోని ముచ్చుమర్రి సభలోనూ ఐజయ్య మాట్లాడుతుండగా సీఎం మైక్ కట్ చేయించడం గమనార్హం. -
లోకకల్యాణం కోసమే అప్తోర్యామం
కర్నూలు(జిల్లా పరిషత్): అప్తోర్యామం, మహాసౌర యాగాలతో పర్యావరణ పరిరక్షణతో పాటు లోక కల్యాణం సిద్ధిస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం స్థానిక గాయత్రి ఎస్టేట్స్‌లోని పుష్పక్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మహాయాగాన్ని విజయవంతం చేయాలన్నారు. యాగంలో పాల్గొనాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించామన్నారు. కృష్ణదేవరాయల కాలం నుంచే రాయలసీమ ప్రాంతంలో యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారన్నారు. యాగం మహా యోగమని.. కులమతాలకు అతీతంగా ఇలాంటి యాగాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాగానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలన్నారు. కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతంలో యాగ నిర్వహణ వల్ల సస్యశ్యామలం అవుతుందన్నారు. మాజీ మంత్రి కె.ఈ.ప్రభాకర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి కర్నూలు రాధాని కాలేకపోయినా.. యజ్ఞయాగాలకు రాజధాని అవడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా యాగానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హోమ పర్యవేక్షకులు బ్రహ్మశ్రీ కేసా ప్రగడ హరిహరనాథశర్మ మాట్లాడుతూ 90 ఏళ్ల క్రితం రెంటచింతల యాజులు ఈ యాగాన్ని రాష్ట్రంలో నిర్వహించారన్నారు. అప్తోర్యామం-శ్రౌతయాగం-మహాయాగం-స్మార్త యాగం ఏకకాలంలో ఒకే స్థలంలో, రెండు విడివిడి యాగశాలల్లో, రెండు విడి బృందాలుగా చేపట్టడం విశేషమన్నారు. జీవకోటి ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, దీక్షతో నిర్వహించే ఇలాంటి మహాయాగాలు అరుదన్నారు. సమావేశంలో ప్రజాహిత సేవా సమితి ట్రస్ట్ బ్రహ్మశ్రీ కేసా ప్రగడ ఫణిరాజశేఖరశర్మ, యాగ పీఆర్వో వెంకటాచలం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ ధనారెడ్డి, పబ్లిక్‌హెల్త్ రిటైర్డ్ ఎస్ఈ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఎమ్మెల్యే ఐజయ్య, రాయలసీమ, Environmental conservation, MLA ijayya, Rayalaseema