వైఎస్సార్‌సీపీ నేత జాన్ వెస్లీ
విశాఖపట్నం: నిరుద్యోగులను పక్కదారి పట్టించడానికే నిరుద్యోగ భృతిలో నిబంధనలు పెట్టారని చంద్రబాబుని ఉద్దేశిస్తూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ విమర్శించారు. జాన్ వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ..యువనేస్తం కేవలం ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి కాదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ప్రారంభించి నాలుగున్నరేళ్లు అయినా నేటికీ ఒక్క అభ్యర్థి సివిల్స్‌కు గానీ, గ్రూప్ వన్‌కు గానీ ఎంపిక కాలేదని తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు బీసీ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నడిపారని విమర్శించారు.
గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో దాడులు జరిగి అనేక అక్రమాలు బయటపడి ప్రభుత్వానికి నివేదిక అందినా నేటికీ ఆ వివరాలను చంద్రబాబు బయటపెట్టలేదని విమర్శించారు. కిడారి, సోమల హత్య కేసులో మాజీ ఎంపీటీసీ రాజారావు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సమావేశంలో అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ, రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment