సాక్షి,సిటీబ్యూరో: వేసవి ప్రారం భంలోనే ప్రచండ భానుడి ప్రతాపానికి గ్రేటర్ సిటీజన్లు విలవిల్లాడుతున్నారు. ఆదివారం అత్యధికంగా 36.9 డిగ్రీలు, కనిష్టంగా 20.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి దాకా నమోదైన అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచే ఎండ చుర్రు మనిపించడంతో వివాహాది శుభకార్యాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వృద్ధులు, చిన్నారులు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లారు.
ఎండ తీవ్రత పెరగడంతో కొబ్బరి బొండాలు, లస్సీ, బటర్‌మిల్క్, పండ్ల రసాలకు గిరాకీ అమాంతం పెరి గింది. మరో 48 గంటల్లో గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ సీజన్‌లో ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని.. వేడిగాలుల ఉధృతి అధికంగా ఉంటుందని బేగం పేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment