సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం చూస్తుంటాం. పుట్టిన బిడ్డ కళ్లు తెరిచి చూడడానికి కూడా రెండు మూడు గంటలు పడుతుంది. అయితే బ్రెజిల్‌లోని రియో డీ జెనిరియోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే జన్మించిన శిశువు డాక్టర్ల వైపు కోపంగా చూస్తున్నట్లు ఉండే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పసిపాపను చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ ఫొటోలపై నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. శిశువు ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకొనేందుకు పిల్లలను ఏడిపించడం సర్వ సాధారణం.
బొడ్డు తాడు కత్తిరించక ముందే ఆ బిడ్డ ఏడుస్తుందో లేదోనని పరీక్షించారు. చిత్రంగా ఆ బిడ్డ ఏడ్వడానికి బదులు డాక్టర్ల వైపు కోపంగా చూడసాగింది. ఎంతకీ ఏడవకుండా ఉండేసరికి పసిపాప బొడ్డు తాడును కత్తిరించారు. దీంతో ఆ నొప్పికి శిశువు ఏడ్చింది. దీంతో వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ప్రసవానికి ముందే బిడ్డకు ఆమె తల్లిదండ్రులు ఇసాబెలా పెరీరా డి జీసస్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన ఆనంద క్షణాలను చిత్రాల్లో బంధించేందుకు ఇసాబెలా తల్లి డయాన్ డి జీసస్ బార్బోసా స్థానిక ఫొటోగ్రాఫర్ రోడ్రిగో కున్స్‌ట్మాన్‌ను ఏర్పాటు చేసుకుంది. అందువల్ల మనకు ఈ అరుదైన చిత్రాలను చూసే అవకాశం కలిగింది. చదవండి: ఎవరైనా నన్ను చంపేయండి!..
Comments
Please login to add a commentAdd a comment