టిక్‌టాక్ ద్వారా ఎంతో మంది స్టార్స్ అయిపోయారు. అయితే ఒక్కసారిగా భారతప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంతో టిక్‌టాక్‌స్టార్స్‌తో పాటు చాలా మంది అభిమానులు ఢీలా పడిపోయారు. టిక్‌టాక్‌కు బదులుగా చింగారి, మోజ్, మెట్రాన్‌లాంటి స్వదేశీ యాప్‌లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటతికి తోడు ప్రముఖ మీడియా ప్లేయర్, స్ట్రీమింగ్ యాప్ ఎంఎక్స్ ప్లేయర్ ‘ ఎంఎక్స్ టకాటక్’ పేరుతో అచ్చం టిక్‌టాక్‌లాగానే ఉండే ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చదవండి: టిక్‌టాక్ ప్రియులకు ఇన్‌స్టా గుడ్ న్యూస్!
దీని పేరు దగ్గర నుంచి దీనిలోవచ్చే వీడియోలు అన్ని టిక్‌టాక్‌కు దగ్గరగా ఉన్నాయి. భారతీయత ఉట్టిపడేలా దీనిలో జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను ఉపయోగించారు. దీనిలో కూడా టిక్‌టాక్‌లో మాదిరిగా డబ్డ్ వీడియోలు, క్రియేట్‌గా చేసే వీడియోలు అప్‌లోడ్ చేసే అవకాశం, రకరకాల ఎఫెక్ట్‌లు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ యాప్‌ను 50,000పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌కు రేటింగ్ కూడా 4.2 వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment