
నటుడు యశ్
యశవంతపుర: అద్దె ఇవ్వకూండా ఇంటి యజమానిని బెదిరించారనే అరోపణలు ఎదుర్కొంటున్న నటుడు యశ్‌కు కోర్టులో చుక్కెదురైంది.మూడు నెలల్లో అద్దె ఇంటిని ఖాళీ చేయాలని బెంగళూరు నగరంలోని 42వ సిటీ సివిల్ కోర్టు మంగళవారం అదేశించింది. 2010 నుంచి కత్రిగుప్పకు చెందిన మునిప్రసాద్ ఇంటిని నటుడు యశ్ అద్దెకు తీసుకున్నాడు. మొదట సక్రమంగా బాడుగను ఇచ్చేవారని, తర్వాత నిర్లక్ష్యం చేయడంతోపాటు ఇంటి యజమానిని బెదిరించారనే ఆరోపణలున్నాయి. ఇంటిని ఖాళీ చేయాలని సూచిస్తే బెదిరంచినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అనేక సార్లు ఇరువురి మధ్య ఘర్సణ కూడా జరిగాయి. మునిప్రసాద్ ఫిర్యాదు మేరకు గిరినగర పోలీసులు యశ్, అతడి తల్లి పుష్పలపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. 2010 నుంచి బకాయి ఉన్న రూ. 9 లక్షల 60 వేలు చెల్లించాలని, మూడు నెలల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment