సీపీఎల్ ఫ్రాంచైజీపై విజయ్ మాల్యా
న్యూఢిల్లీ: ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఆ మధ్య కరీబియన్ ప్రీమియర్ టి20 లీగ్ (సీపీఎల్)లో ఓ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఫిబ్రవరిలో బార్బడోస్ ట్రిడెంట్స్‌ను కేవలం 100 డాలర్ల (రూ.6,600)కే తీసుకున్నట్టు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘సీపీఎల్‌లో జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి నాపై ఓ రకమైన ప్రచారానికి దిగుతున్నారు. ఆ జట్టు కొనుగోలు అనేది వాటాలు తీసుకోవడం ద్వారా జరిగింది.
అయితే దీని కోసం ఓ వంద డాలర్ల ఖర్చు జరిగింది. అయితే కచ్చితంగా టోర్నీలో ఆడాల్సిందిగా మా నుంచి హామీ తీసుకున్నారు. నిజానికి ఫ్రాంచైజీ నిర్వహణకు 2 మిలియన్ డాలర్ల (రూ.13 కోట్లు) వరకు కావాల్సి ఉంటుంది. అందుకే బార్బడోస్ ప్రభుత్వ సహాయం తీసుకున్నాం. వారు మా జట్టుకు సబ్సిడీ మంజూరు చేశారు’ అని మాల్యా వివరించారు.
100 డాలర్లకే జట్టును కొన్నా!
Published Tue, Apr 12 2016 1:15 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement